చిత్ర పరిశ్రమలోకి చాలా మంది నటులు వచ్చి వెళ్తూ ఉంటారు. అందులో కొంత మంది స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి బిజీగా మారిపోతూ ఉంటారు. ఇక చిత్ర పరిశ్రమలో హీరోలు లేదా హీరోయిన్లు వారి కెరియర్ పట్ల ఎంతో బిజీగా రాణిస్తున్న సమయంలో వారి వ్యక్తిగత వ్యవహారాలను, సినిమాకి సంబంధించిన డేట్స్ ని చూసుకోవడం కోసం మేనేజర్లను పెట్టుకుంటారన్న సంగతి అందరికి తెల్సిందే.

ఈ తరుణంలోనే హీరోలు లేదా హీరోయిన్ల సినిమాల విషయంలో డేట్స్ అడ్జస్ట్ చేయడం లేదా వారికి సంబంధించిన ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా మేనేజర్లు చూసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే  చాలా మంది హీరోయిన్లు బిజీగా ఉండటం వల్ల వారు సంపాదించిన మొత్తాన్ని మేనేజర్ చేతికి అప్పగిస్తూ ఉంటారు. అయితే అందులో కొంతమంది మేనేజర్లు చేతివాటం చూపిస్తూ పెద్ద ఎత్తున సదరు సెలబ్రిటీలను మోసం చేస్తున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాము.

ఇక ఇలా మేనేజెర్ చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ఆలా మోసపోయిన వారిలో స్టార్ హీరోయిన్  మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు. తమన్నా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్న సమయంలో తన ఫైనాన్షియల్ విషయాలన్నీ పూర్తిగా మేనేజర్ ని నమ్మి అతని చేతికి అప్పగించింది. ఈ తరుణంలోనే సదరు మేనేజర్ ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ లను కట్టకుండా చేతివాటం చూపించాడు.

ఈ తరుణంలోనే ప్రభుత్వం నుంచి తమన్నాకు నోటీసులు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమెకి నోటీసులు రావడంతో ఏం జరిగిందని తమన్నా ఆరాతీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పూర్తిగా డబ్బు విషయంలో తన మేనేజర్ ని నమ్మినందుకు తనని దారుణంగా మోసం చేశారని తెలుసుకున్న తమన్నా తిరిగి తన డబ్బులతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించారు. ఇక అప్పటి నుంచి ఈమె ఫైనాన్షియల్ విషయాలలో కొంత జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: