రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం అయితే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఈయన అప్పట్లో సరి కొత్త ట్రెండ్ ను సెట్ చేసేవారు. అందుకు ఉదాహరణ ప్రపంచంలో శివ అనే ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన ఘనత రాంగోపాల్ వర్మ కు దక్కింది.. ముఖ్యంగా సినిమా అంటే ఇలాగే ఉండాలి అని చూపించాడు రామ్ గోపాల్ వర్మ.. నటుల బాడీ లాంగ్వేజ్.. సమయానికి డైలాగ్ డెలివరీ.. యాక్షన్ సీన్స్.. సౌండ్ సిస్టం.. కెమెరా పనితనం ఇలా ప్రతి అంశానికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్న రామ్ గోపాల్ వర్మ సరికొత్త ధనాన్ని ప్రపంచానికి చూపించారు.. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1990 డిసెంబర్ 7వ తేదీన విడుదలైన శివ సినిమాకు యావత్ ప్రపంచంలో ఉన్న యూత్ అంతా ఈ సినిమాకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..

నాగార్జున , రఘువరుణ్ , అమల , జె.డి.చక్రవర్తి లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్ ను బాగా ప్రభావితం చేసింది. ఇకపోతే ఈ సినిమా గురించి చక్రి భ్రమణం అనే కార్యక్రమంలో తాజాగా జెడి చక్రవర్తి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. శివ రిలీజ్ రోజున మేమంతా హైదరాబాద్ లోనే ఉన్నాము.  టెన్షన్లో ఉన్న మేము ఆరోజు దేవి థియేటర్ దగ్గర ఉన్నాము.. కానీ వర్మ మాత్రం అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడో నాకు మాత్రమే తెలుసు. రాంగోపాల్ వర్మ మద్రాస్ లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ స్టేట్స్ కి వెళ్తున్న సమయంలో  ఆ రోజు ఉదయాన్నే ఫ్లైట్లో మద్రాసుకు వెళ్లి ఆ రోజంతా ఆమెతో గడిపాడు.

తిరిగి రాత్రి థియేటర్ కి వచ్చినప్పుడు ఏంటి సార్ ఇది.. అని నేను అడిగినప్పుడు.. ఇక్కడ ఉండి ఏం చేయాలి అయ్యా.. అక్కడ ఆ అమ్మాయి తో ఉంటే నేను ఏమైనా చేయగలను అని చెప్పాడు.. ఆ క్షణంలో నేను ఆ అమ్మాయితో ఏం చేయాలో అది చేసేసి వచ్చాను
. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎప్పుడు వదులుకోకండి అని నాతో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన ఏంటో మీకు తెలుసు.. రాంగోపాల్ వర్మ అప్పట్లో కూడా అలాగే ఉండేవాడు అని తెలిపాడు చక్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: