తెలుగు బుల్లితెర బిగ్  బాస్ సీజన్ 5 రియాలిటీ షోను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు పది వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక చూస్తూ చూస్తూనే బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంటుంది. అయితే 11 వ వారంలో భాగంగా బిగ్ బాస్ ఇంటి నుండి డి అని మాస్టర్ ఎలిమినేట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. చాలావరకూ  అని మాస్టర్ బయటికి వెళ్లి పోవడానికి గల కారణం తన గత రెండు వారాల ప్రవర్తనే అని జనాలు చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ ఎండింగ్ కి రావడంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అని పెద్ద ఎత్తునే చర్చలు జరుగుతున్నాయి. 

హౌస్ లో లో వారం వారం కంటెస్టెంట్ లు తగ్గుతున్న కొద్దీ పోటీ పెరుగుతుంది.. అలాగే వాళ్ళ ఆట కూడా రసవత్తరంగా సాగుతుంది. వీళ్ళ ఆటను ప్రవర్తనను బట్టి చూస్తే ఈ సీజన్ విన్నర్ ఎవరో కొంత మేరకు ఒక అవగాహన వచ్చింది ప్రేక్షకుల్లో. అయితే సోషల్ మీడియా కథనాలను బట్టి చూస్తే లాస్ట్ వరకు యాంకర్ రవి శ్రీరామచంద్ర సన్నీ ఉంటారేమో నని అంచనా. ఇంట్లోనే సభ్యుల మధ్య పోటీ పెరగడంతో నువ్వా నేనా అన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతూ టాస్క్ లను ఆడుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గురించి మరింత ఆసక్తి పెరిగింది. ప్రేక్షకుల ఆదరణను బట్టి చూస్తే ఈ రేసులో మొదటి స్థానంలో సన్నీ ఉన్నట్లు తెలుస్తోంది.

 అయితే సన్నీ మొదటి వారం నుండి ఇప్పటివరకు ప్రతి వారం నామినేట్ అవుతూ వస్తున్నాడు. అయినప్పటికీ ఏమాత్రం బెదరకుండా తనదైన శైలిలో తన గేమ్ ను ఆడుతూ అందరి ఆదరణ లను పొందుతున్నాడు. తన నిజాయితీని చూసి ఎన్నడూ లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది సన్నీకి. దీంతో తో బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ నిలుస్తాడని చాలా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఈ రేసులో సన్నీ తోపాటు షణ్ముక్ జశ్వంత్ కూడా ఉన్నాడు కానీ తన ప్రవర్తన వల్ల షణ్ముఖ్ వెనకబడ్డాడు. దీంతో తో విన్ అవుతాడు అని చెప్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ నా లేక వేరే ఎవరైనా నా అనేది చూడాలి మరి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: