తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కేసు అనేది గత కొన్నేళ్ల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. డ్రగ్స్ కేసు కు సంబంధించి గత కొన్ని రోజులుగా కొన్ని కొన్ని విషయాలు వెలుగులోకి రావడం అలాగే కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా ప్రస్తావనకు రావడం అలాగే కొంతమంది దర్శకులు కూడా విచారణకు హాజరు కావడం అనేది ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్పాలి. ఈ డ్రస్ కేసుకు సంబంధించి బాలీవుడ్ తో కూడా కొంతమందికి సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ఇక్కడికి వచ్చి డ్రగ్స్ అమ్ముతున్నారని కొంత సమాచారాన్ని అధికారులు సేకరించారు.

ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో అధికారులు చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా ప్రధానంగా ఇందులో హీరోయిన్ పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా ముందుకు వెళుతున్నారని ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో మరో హీరోయిన్ పేరు కూడా ఇప్పుడు డ్రగ్స్ కేసు విషయంలో కనబడుతోందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అవసరమైతే కొంత మందిని అరెస్టు కూడా చేసే అవకాశం ఉందని బాలీవుడ్ లో కొంతమంది ప్రముఖుల ద్వారా ఇక్కడ డ్రమ్స్ విక్రయిస్తున్నారని గుర్తించినట్లుగా కూడా సమాచారం.

డ్రగ్స్ కేసుకు సంబంధించి తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా దృష్టి పెట్టాయి. సినిమా వాళ్లను డ్రగ్స్ కేసులో సంబంధించి వాడుకునే విధంగా కొంతమంది ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే ఇప్పుడు సీరియస్ గా ముందుకు వెళుతున్నారని ప్రధానంగా బాలీవుడ్ వ్యవహారాలతో తెలుగులో ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని కొన్ని అంశాలను సీరియస్గా తీసుకున్న అధికారులు ఎవరైనా సరే ఇందులో ఉపేక్షించేది లేదని ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉండటంతో అధికారులు మరింత దూకుడుగా వెళుతున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: