తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోయిన్ గా టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు. వారి అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సినీ జీవితంలో మంచి ఊపులో ఉన్నప్పుడు, వారి వ్యక్తిగత జీవితం కారణంగా చాలా కష్టాలతో ఉన్నప్పటికీ వారు బాధ చూపించకుండా తమ సినీ జీవితంలో రాణిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత గురించి తెలియని వారంటూ ఉండారు. సమంత తెలుగు,తమిళ,మలయాళ వంటి సినిమాలలో కూడా హీరోయిన్ గా రాణిస్తుంది. అయితే ఆమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతుంది. సమంత ఈ మధ్యనే తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే.

లేడి సూపర్ స్టార్ నయనతారకి ఎన్నో ప్రేమ కథలు నడిపించింది. ఆమె మొదట్లో హీరో శింబుతో ప్రేమాయణం జరిపి ఆ తర్వాత ఆయనతో బ్రేక్ అప్ చెప్పింది. ఆ తరువాత హీరో ప్రభుదేవాతో కొద్దిరోజులు ప్రేమాయణం నడిపించింది. అంతేకాదు.. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబితున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ వీరిద్దరికి బ్రేక్ అయ్యింది. ఇప్పుడు నయనతార విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తుంది.

చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక. ఆమె తెలుగు, కన్నడ తమిళ్ వంటి సినిమాలలో మంచి హీరోయిన్ గా పేరు, గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. ఆమె బాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తుంది. రష్మిక గతంలో రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం చేసుకుని, ఆ తర్వాత వివాహానికి క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా రాణిస్తున్న త్రిష ముఖ వ్యాపారవేత్త వరుణ్ మణి యన్ తో నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత వివాహాన్ని రద్దు చేసుకున్నారు.

హాని ఇస్ ద బెస్ట్ అంటూ క్యూట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్‌తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. కానీ ఏమైందో తెలియదు గానీ వివాహాన్ని రద్దు చేసుకుంది. అలాగే కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడి కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: