ఒకప్పుడు తెలుగులో వి.వి.వినాయక్ తెలుగులో మంచి సినిమాలు చేసి గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న సంగతి మనకు తెలిసిందే. చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే వివి వినాయిక్ చాలా శ్రద్ధగా చేయడమే కాకుండా ఆ సినిమాలను విడుదల చేసే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అగ్ర హీరోలందరితో దాదాపుగా వినాయక సినిమాలు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే వి.వి.వినాయక్ ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడని పెద్ద హీరోలు ఆయనతో ఓ సినిమా చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు.

అయితే ఇప్పుడు వి.వి.వినాయక్ మహేష్ బాబు సినిమా చేసే అవకాశం ఉందని రాజమౌళితో సినిమా కంటే ముందే ఈ సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమాను తెరకెక్కించి అవకాశం ఉండవచ్చని దాదాపుగా ఆరు నెలల్లో ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేసే అవకాశం ఉందని ఆ తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఏది ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితులు మాత్రం వి.వి.వినాయక్ కు కాస్త కలిసొచ్చే అవకాశం కనపడుతోంది. వినాయక ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు కథలు రెడీ చేసి పెట్టుకొన్న సరే హీరోలెవరూ అందుబాటులో లేకపోవడంతో కాస్త వెనక్కు తగ్గుతుందనేది అర్థమవుతుంది. మరి భవిష్యత్తులో అయినా సరే ఆయనకు పెద్ద హీరోలతో సినిమాలు చేసే విధంగా ముందుకు వెళతారు మహేష్ బాబు అనుకున్న విధంగా ఆరు నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేస్తారా అనేది తెలియాలి. అలాగే తాను ప్రధాన పాత్రలో వి.వి.వినాయక్ ఒక సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో లేదో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: