మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే కచ్చితంగా అది భారీ విజయం సాధిస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రాజమౌళి ముందు నుంచి కూడా రెడీ గా ఉండటమే కాకుండా జూనియర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎలాంటి సినిమా అయినా చేయడానికి రెడీ గా ఉంటాడు అనే మాట వాస్తవం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి రామ్ చరణ్ తో కలిపి ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనకు తెలిసిందే.

సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఒక కథ కూడా రెడీగా పెట్టుకున్నారు అని ఎప్పుడో రెడీ చేసుకున్న కథను అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కే అవకాశం ఉందని ఆ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్యను కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ బాబుతో చేసే సినిమాను వేగంగా పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాను తెరకెక్కించి అవకాశం ఉందన్నమాట వినపడుతోంది.

ఈ సినిమాలో విలన్ గా సూర్య కనబడే అవకాశం ఉందని కొంతమంది అంటే అది కూడా మల్టీస్టారర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయడానికి సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో ఈ సినిమాను ముందుకు నడిపిస్తారని అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తో సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలి. 2026 లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: