అక్కినేని నాగార్జున వారసుడిగా మొదట ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నాగ చైతన్య సినీ కెరియర్ అసలు ఎలా మొదలయ్యిందొ తెలుసా.. చైతు తండ్రి అక్కినేని నాగార్జున , తల్లి లక్ష్మి కొన్ని కారణాల వలన విడిపోవడం జరిగింది. ఆ తర్వాత నుండి చైతు తన తల్లి దగ్గరే చెన్నైలో పెరిగారు.18 సంవత్సరాల వరకు తల్లి లక్ష్మి వద్ద పెరిగిన నాగ చైతన్య హైదరాబాద్ లో తండ్రి దగ్గర కు వచ్చారు. ఇక్కడే ఉంటూ డిగ్రీ లో బీకాం గ్రూప్ లో చేరారు. అయితే రెండవ సంవత్సరంలో ఉండగా నాకు సినిమాల్లో నటించాలని ఉంది అని నాగ్ కు తెలిపారట. దాంతో తనయుడి కోరిక మేరకు ముంబైలోని యాక్టింగ్ స్కూల్లో నాగచైతన్యకు ట్రైనింగ్ ఇప్పించారు నాగ్.

డబ్బింగ్, డ్యాన్స్ ఇలా ఓ హీరోకి కావలసిన అన్ని అంశాలలో శిక్షణ పొందారు. అంతేకాదు లాస్ ఏంజిల్స్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా పొందారు చైతు. అనంతరం తిరిగి వచ్చి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. జోష్ సినిమాతో కెరియర్ ని ప్రారంభించారు నాగ చైతన్య. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ తనయురాలు ఇందులో డెబ్యూ హీరోయిన్ గా చేసింది. కానీ ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కానీ రెండవ సినిమా 'ఏమాయ చేసావే' సినిమా మాత్రం ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చింది. ఈ సినిమాతో సమంత హీరోయిన్ గా పరిచయమయిన విషయం తెలిసిందే.

హీరో హీరోయిన్ ఇరువురికి కూడా ఈ సినిమా వారి కెరీర్ ను మలుపు తిప్పే మైలు రాయిగా నిలిచింది. ఆ తర్వాత ఎవరి సినీ లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. ఈ మధ్య సరైన హిట్ లేక నిరాశపడిన చైతు లవ్ స్టోరీ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కి తన సత్తా చాటుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: