ప్రస్తుతం జనాలు ఓటిటి ల వాడకానికి చాలా బాగా అలవాటు పడిపోయారు. కరోనా కు ముందు జనాలు ఓటిటి మాధ్యమాలను పెద్దగా వాడుకపోయినప్పటికీ కరోనా సమయం నుండి ఓటిటి ల వాడకం బాగా పెరిగిపోయింది. థియేటర్ లోకి వెళ్లి కరోనా బారినపడే కంటే ఇంట్లో కూర్చొని హాయిగా కుటుంబంతో సినిమా చూడడం మేలు అనే ఉద్దేశంతో చాలామంది వీటికి అలవాటు పడిపోయారు. ఆ తర్వాత థియేటర్ లు కూడా మూతపడడంతో సినీ ప్రేక్షకులకు ఇది ఏకైక ఆప్షన్ గా మారిపోయింది. కొంతకాలం క్రితం వరకు స్టార్ హీరోల సినిమాలు హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 50 రోజులు పూర్తయిన తర్వాతే డిజిటల్ మాధ్యమాలలో ప్రచారం అయ్యేటట్టు చిత్ర నిర్మాతలు ఓటిటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేవారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. సినిమాలు థియేటర్ లలో విజయవంతమైతే అవి ఓటిటి లలో కొంచెం ఆలస్యంగా ప్రచారం అవుతున్నాయి.

అదే థియేటర్ లలో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఆ సినిమా దాదాపు నెల తిరిగేలోపే డిజిటల్ మాధ్యమాల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా పెద్దన్న పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ సినిమా తమిళ్ లో పర్వాలేదు అనిపించుకున్నప్పటికి, తెలుగులో మాత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. ఇలా జలాలను థియేటర్ లలో అలరించలేకపోయిన ఈ సినిమా ఈ నెల 26 వ తేదీ నుండి సన్ నెక్స్ట్ ఓటిటి లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా, రజనీకాంత్ కి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. అలాగే ఈ సినిమాలో కుష్బూ, మీనా ప్రముఖ పాత్రలు పోషించారు. థియేటర్ లలో ఈ సినిమా అలరించలేకపోయిప్పటికి ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా.?  అని అనేక మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: