సమంత తన భర్తతో విడాకులు ప్రకటించిన తర్వాత తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. తాజాగా లేడీ లెజెండ్ నయనతారతో కలిసి సమంత , విజయ్ సేతుపతి ఒక సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా ఏదో కాదు కాతువాకుల రెండు కాదల్.. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పూర్తయింది. వచ్చే నెల అనగా డిసెంబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా కూడా చిత్రం యూనిట్ ప్రకటించింది.. అంతేకాదు మరో వారంలో సినిమా విడుదల తేది పై స్పష్టత ఇస్తామని ప్రకటించారు.


ఇకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తే మనకు సులభంగా అర్థమవుతుంది.. ఇక ఈ సినిమాకు దర్శకుడు నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్. ఇక ప్రియుడితో కలిసి నయనతార ఈ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఆమె సొంతంగా నిర్మించింది.. విగ్నేష్ శివన్ ఈ సినిమాలో వీరి ముగ్గురి పాత్రలను చాలా విభిన్నంగా చూపించారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త తమిళ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.


అంటే ఈ సినిమాలో నయనతార విలన్ గా కనిపించబోతున్నాడట.. అంతే కాదు సమంత, విజయ్ సేతుపతి ల మధ్యకు వెళ్లి వారి ప్రేమకు విలన్ గా మారబోతోంది అని సమాచారం. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సమంత లు ప్రేమికులుగా లేదా పెళ్లి చేసుకున్న జంటగా మనకు కనిపించబోతున్నారు. ఇక వీరిద్దరి మధ్య విభేదాలు పెట్టడానికి ప్రయత్నం చేసే పాత్రలో, ప్రేక్షకులకు కనిపించబోతోంది అన్నట్లుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.. ఇక ఇలాంటి ఒక సర్ప్రైజింగ్ క్రేజీ కథను చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే వారంలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుంది.ముఖ్యంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్ లో ఈ సినిమాను తెరకెక్కించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: