యస్..ఇప్పుడు అందరు ఇదే మాట్లాడుకుంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. రాజమౌళి సినిమా వస్తుందంటే పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన తీసిన సినిమా రిలీజ్ అయ్యే డేట్స్ లో వాళ్ల సినిమా ఉండకుండా చూసుకుంటారు హీరోలు. బడా హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయితే జక్కన భారీ బడ్జేట్ తో తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా జనవరి 7న ధియేటర్స్ లో విడుదల కానుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

దీంతో జనవరిలో తమ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్న కొందరు  డైరెక్టర్లు  వాళ్ల సినిమాలని పోస్ట్ పోన్ చేసుకున్నారు. కాగా , కొన్ని రోజుల కింద‌టే RRRకు సంబంధించి ఒక ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో పాల్గొన్న జక్కనను ఓ విలేకరి.. జ‌న‌వ‌రి 7న‌ ఆర్ఆర్ఆర్‌, 6న గంగూబాయి క‌తియావాడీ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌టం గురించి ప్రశ్నించారు . దీనికి రాజమౌళి సమాధానమిస్తూ..కరోనా తరువాత  ప‌రిస్థితుల్లో సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాంటి పోటీ కామన్ అంటూ చెప్పుకోచ్చారు. అంతేకాదు కంటెంట్ ఉంటే  ఎన్ని సినిమాలైనా కూడా ఒకేసారి రిలీజ్ చేయచ్చు అని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఓకే ఇంత వరకు బాగానే ఉంది.

కానీ ఇప్పుడు రాజమౌళి చేసిన పనే అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.  తన సినిమాకు పోటి ఉండదని పరోక్షంగా చెప్పిన  రాజమౌళి.. ఇప్పుడు భీమ్లా నాయ‌క్ మూవీని విడుదల కాకుండ అడ్డుపడుతుండడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. జనవరి 12న రిలీజ్ అవ్వాల్సిన భీమ్లా నాయ‌క్ చిత్రాని పోస్ట్ పోన్ చేయాలని రాజ‌మౌళి గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ చేసిన ప్ర‌య‌త్నం కూడా ఫలించకపోవడంతో నేరుగా రాజ‌మౌళినే , ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసి భీమ్లా నాయ‌క్ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకునే విష‌య‌మై రిక్వెస్ట్ చేయ‌బోతున్నాడ‌ని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. ఒకవేళ ఇదే నిజ‌మైతే రాజమౌళి  ఇంటర్వ్యుల్లో చెప్పిన మాట‌ల‌కు, ఇప్పుడు  చేస్తున్న ప‌నికి అసలు పొంత‌నే లేదు అంటూ విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్స్.  

మరింత సమాచారం తెలుసుకోండి: