స్వర్గం నరకం అనే మూవీని దాసరి నారాయణరావు డైరెక్షన్ వహించారు. ఏ డైరెక్టర్ అయినా ఒక కొత్త యువ హీరోతో కలసి రిస్కు చేయాలనుకోరారు. కానీ నీ దాసరి నారాయణ మాత్రం "స్వర్గం నరకం" సినిమాను చేసి చూపించాడు. ఇక ఈ చిత్రం తోనే మోహన్ బాబు అంటే ఎవరో, ఆయన నటన ఏమిటో అందరికీ తెలిసింది. ఈ సినిమా తరువాత మోహన్ బాబు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోహన్ బాబుకి ఎన్నో అవకాశాలు ఇవ్వడమే కాకుండా.. తన పేరును కూడా మార్చేశాడు దాసరి గారు.

అందుచేతనే మోహన్ బాబుకు దాసరి గారీ పై అంత ప్రేమ ఉంటుంది. ఇక ఈ సినిమా 1975వ సంవత్సరంలో నవంబర్ 22 వ తేదీన విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికీ 47  సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దీంతో మోహన్ బాబు నటుడు గా ఎంట్రీ ఇచ్చి 47 సంవత్సరాలు అవుతుంది అన్నమాట. దాసరి నారాయణ రావు మోహన్ బాబు తో కలసి కొన్ని సినిమాలలో హీరోగాను, విలన్ గా కూడా నటించారు.
ఇక దాసరి డైరెక్షన్ లో మోహన్ బాబు కామెడీ తో కూడిన విలనిజాన్ని కూడా చేయడం విశేషం. ఇక అలా మోహన్ బాబు హీరోగా అవ్వడం కోసం నిర్మాతగా కూడా మారాడు. తన సొంత బ్యానర్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ వరుస హిట్లు లను సాధించాడు. అలా సాగిన ప్రయాణం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది.

తాజాగా సన్ ఆఫ్ ఇండియా అనే మూవీ లో నటిస్తున్నాడు ఈయన. ఆ సినిమాలో తను మాత్రమే చేయగలిగే ఎటువంటి పాత్రలో నటిస్తున్నానని పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు మోహన్ బాబు. ఇలా ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిలబడి, పద్మశ్రీ ని అందుకున్నాడు మోహన్ బాబు. ఇక ఇప్పటికీ తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఉంటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: