బిగ్ బాస్ రియాల్టీ షో ప్రసారం అవుతున్న అన్ని భాషల్లోనూ మంచి ప్రజాదరణ తో ముందుకు దూసుకు పోతుంది. ఈ షో లో మిగతా ఐదు రోజులు ఒక ఎత్తు, శని, ఆది వారాలు ఓక ఎత్తు. ఎందుకంటే ఆ రెండు రోజుల్లో ఈ షో కు హోస్ట్ గా వ్యవహరించే సెలబ్రిటీ వస్తాడు కాబట్టి. అయితే షో కు హోస్ట్ గా వ్యవహరించే సెలబ్రిటీ  ఏదైనా అత్యవసర పని ఉన్నా, సినిమా షూటింగ్ లు ఉన్నా, లేదా ఇతర కారణాల వల్ల షో కు హాజరు కాలేక పోయినట్లయితే, ఆ ఎపిసోడ్స్ కు వేరే వ్యక్తి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. అప్పట్లో ఒక సారి తెలుగు బిగ్ బాస్ లో నాగార్జున షూటింగ్ పని వల్ల  షో కి అటెండ్ కాలేను పరిస్థితుల్లో సమంత హోస్ట్ గా వ్యవహరించింది. అయితే తాజాగా తమిళ బిగ్ బాస్ కు కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. ఇటీవల అమెరికా టూర్ కి వెళ్ళిన కమల్ హాసన్ కు కరోనా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే, ప్రస్తుతం కమల్ హాసన్ చికిత్స తీసుకుంటున్నాడు.

 అయితే కరోనా కారణంగా రెండు వారాల పాటు కమల్ హాసన్ బిగ్ బాస్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో కమల్ హాసన్ స్థానంలో కమల్ హాసన్ కూతురు  ప్రముఖ నటి అయిన శృతి హాసన్ ను బిగ్ బాస్ షో కు హోస్ట్ గా తీసుకురావాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ అయితే బాగుంటుంది అని ఆ దిశగా షో నిర్వాహకులు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా సాలర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.ల్, ఈ సినిమా తో పాటు  నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: