వరస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా చాలా డల్ అయిపోయాడు యంగ్ హీరో నితిన్. ఆయన హీరోగా నటించిన భీష్మ సినిమా సూపర్ హిట్. కావడం తో ఆ తర్వాత ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సినిమాలు బాక్స్ఆఫీసు వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచాయి. చెక్ మరియు రంగ్ దే సినిమా లు ఫ్లాప్ కావడం తో నితిన్ మరోసారి ప్రమాదం లో పడింది అని చెప్పొచ్చు. ఇప్పుడు మరొకసారి నితిన్ భారీ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్.

ఇంకో వైపు కరోనా పుణ్యమా అని ఓ టీ టీ లో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. ప్రేక్షకుల్లో కూడా మార్కెట్ కూడా అదే విధంగా భారీగా విస్తరించడంతో అన్ని భాషల హీరోలు సైతం ఈ ప్లాట్ ఫామ్ పై సినిమాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందరూ కూడా కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న నేపథ్యంలో మాత్రమే థియేటర్లు కమర్షియల్ సినిమా ల కోసం ఉన్నాయి అనే పేరు రావడంతో అభిప్రాయం ఏర్పడుతుంది.

దాంతో మన హీరోలు చాలా మంది ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో నాగచైతన్య డిజిటల్లో ఎంట్రీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా ఓ హారర్ సినిమా లో నటిస్తున్నాడు. తాజాగా ఈ లిస్టులో నితిన్ కూడా చేరుతున్నాడు. ఆయన త్వరలోనే వెబ్ సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు వినిపిస్తుంది. మాచర్ల నియోజకవర్గం సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన మంచి కథల కోసం చూస్తున్నాడు. మొత్తం మీద నితిన్ ఓటీటీ లో ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం ఆలోచన రూపంలో ఉన్న ఈ కార్యము కార్య రూపం ఎప్పుడు దాల్చుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: