ఎక్కడ లాభాలు వస్తాయి అంటే ఇన్వెస్టర్స్‌ అక్కడ వాలిపోతారు. ప్రాఫిట్ లెక్కలు చూసుకుని బిజినెసులు చేస్తుంటారు. హిందీ నిర్మాతలకు తెలుగు సినిమాలు లాభదాయకంగా కనిపిస్తున్నాయి. అందుకే టాలీవుడ్‌ ప్రాజెక్టుల్లో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు బాలీవుడ్‌ మేకర్స్. శంకర్, రామ్‌ చరణ్‌ సినిమాకి అనౌన్స్‌మెంట్‌తోనే మంచి బజ్‌ వచ్చింది. లార్జ్‌ స్కేల్‌ మూవీస్‌తో బ్లాక్‌బస్టర్స్ కొట్టిన శంకర్, చరణ్‌తో ఎలాంటి సినిమా తీస్తున్నాడో అనే ఆసక్తి మొదలైంది. ఇక  తెలుగునాట మంచి బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ జీ స్టూడియోస్‌ కూడా పెట్టుబడులు పెడుతోందట. దిల్‌రాజుతో కలిసి నిర్మాణంలో భాగమవుతోందని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా చేసిన సినిమా 'ట్రిపుల్ ఆర్'. నందమూరి, కొణిదెల హీరోలు కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ హైప్స్‌కి తగ్గట్లుగానే 'ట్రిపుల్ ఆర్' భారీ బిజినెస్‌ చేసింది. లైకా ప్రొడక్షన్స్, పెన్‌ స్టూడియోస్‌ లాంటి సంస్థలు ఈ పీరియాడికల్‌ మూవీని రిలీజ్ చేస్తున్నాయి.

ప్రభాస్‌ చాలాకాలం తర్వాత చేసిన ప్యూర్‌ లవ్‌స్టోరి 'రాధేశ్యామ్'. రాధాక్రిష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే లీడ్‌ రోల్స్‌ ప్లే చేసిన ఈ సినిమాని మూడుసంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు ప్రొడక్షన్‌ హౌజెస్ గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ తో పాటు హిందీ నిర్మాణ సంస్థ టీ-సీరిస్‌ కలిసి నిర్మించాయి. పూరీ జగన్నాథ్, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌తో 'లైగర్' అనే సినిమా వస్తోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో బాక్సింగ్‌ లెజెండ్ మైక్‌టైసన్ స్పెషల్‌ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని పూరీ టాకీస్‌తో కలిసి నిర్మిస్తున్నాడు కరణ్‌ జోహార్.

యూనిక్‌ మూవీస్‌తో బాక్సాఫీస్‌ దగ్గర సెపరేట్ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు అడివి శేష్‌. సినిమా సినిమాకి కొత్తగా ట్రై చేస్తోన్న ఈ హీరో, ఇప్పుడు 'మేజర్' అనే సినిమాతో వస్తున్నాడు. ముంబాయి 26/11  దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్న క్రిష్ణన్‌ కథాంశంతో తెరకెక్కుతోందీ సినిమా. ఇక మహేశ్‌ బాబు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో సోనీ పిక్చర్స్‌ కూడా పెట్టుబడులు పెట్టింది.సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష్ప' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్‌ టైమ్‌ స్టైలిష్‌ స్టార్‌ రగ్గడ్‌ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోస్టర్స్‌తోనే అంచనాలు పెంచిన ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే మంచి బిజినెస్ అయ్యింది. ఎఎ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్స్ లాంటి సంస్థలు డిస్ట్రిబ్యూటింగ్‌ రైట్స్‌ తీసుకున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: