టాలీవుడ్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ జంటగా ప్రేక్షకుల మనసు దోచేసిన సామ్, ఛైతులు అనూహ్యంగా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ విషయం ఒక్క వారి అభిమానులకే కాదు, తెలుగు ప్రేక్షకులందరినీ ఎంతగానో బాధించింది. ఏడేళ్ల ప్రేమ, అయిదేళ్ళ పెళ్లి బంధం అన్నిటినీ చెరిపేసి ఎవరికి వారే యమునా తీరే అంటూ వారి వారి లైఫ్ లో బిజీ అయిపోయారు. వీరి విడిపోవడానికి కారణం ఇవే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెలరేగాయి. అందులో ప్రధానంగా అక్కినేని నాగర్జున భార్య అమల పేరు ఎక్కువగా వినిపించింది. సినిమాల్లో ఇక నటించకూడదు, ఒకవేళ నటించినా ఇలాంటి చిత్రాలే చేయాలి, ఇలాంటి రోల్సే చేయాలి అంటూ కండీషన్లు పెట్టారని గతంలో వార్తలొచ్చాయి.

దాంతో మానసికంగా కుంగిపోయిన సామ్, తమ మాటను గౌరవించడం లేదని చైతు ఇద్దరు విడిపోక తప్పలేదని చాలానే కథనాలే వినిపించాయి. కానీ ఇప్పటికీ వీరు విడిపోవడానికి అసలు కారణం మాత్రం తెలియలేదు. అయితే జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ తమ అభిమాన తారలు సామ్, చైతులు ఒక్కటవ్వాలని కోరుకునే వారు చాలామందే ఉన్నారు. అయితే ఈ రోజు నాగ చైతన్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్, సన్నిహితులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చైతు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే ఈ రోజు సమంత కనుక నాగచైతన్యతో కలిసి ఉండి ఉంటే సెలెబ్రేషన్స్ వేరే లెవెల్ లో ఉండేవని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. విడాకులు అయినా మేము ఫ్రెండ్స్ లాగే కలిసి ఉంటాము అని చెప్పిన సమంత.. ఈ రోజు చైతన్యకు విష్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నట్లు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో సమంత చైతూకు విషెస్ చెప్పినట్లు అయితే లేదు. మరి పర్సనల్ గా చెప్పారో లేదో తెలియదు. ఏది ఏమైనా నాగచైతన్య ఇలాగే ఇంకెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: