సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇపుడు ఈ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు మూవీ మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అక్కినేని ఇంటి వారసుడు నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా చేస్తుండగా, రమ్య కృష్ణ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి వినిపిస్తున్న ఒక వార్త చైతు ఫ్యాన్స్ ని తెగ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఓ ఫైట్ సీన్ ఏకంగా పదినిముషాలు పాటు ఉండనుందని తెలుస్తోంది.

ఫైట్ అంత సేపు అయినా ఏ మాత్రం బోర్ అనిపించకుండా ఎంతో ఆసక్తికరంగా ఆ సీన్ ని చిత్రీకరించారట దర్శకుడు. అంతేకాదు కర్రతో ఈ ఫైట్ సీన్ మొత్తం ఉంటుందట. కాగా పదినిముషాలు పాటు ఎత్తిన కర్ర దించకుండా ఫైట్ చేస్తారట హీరో నాగ చైతన్య. షూటింగ్ సమయంలో కూడా టేక్ లు లేకుండా ఒకేసారి ఈ సీన్ ని కంప్లీట్ చేశారట చైతు. టేక్స్ తీసుకుంటూ చేస్తే సీన్స్ కలుపుకుందాం అని చెప్పినా చైతు ఛాలెంజింగ్ గా తీసుకుని  ఒకే టేక్ లో కంప్లీట్ చేశారట. ఈ సీన్ మొత్తం కర్ర దించకుండా ఫైట్ చేశారట చైతు. సినిమా మొత్తానికే ఇది స్పెషల్ హైలెట్ గా ఉండబోతుందని అంటున్నారు.

మరి ఆ ఫైట్ ఎలా ఉండనుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగక తప్పదు. తాజాగా నేడు అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది బంగార్రాజు టీం. అందులో కూడా చై చేతిలో కర్ర పట్టుకుని  చాలా స్టైల్ గా నడిచి వస్తూ కనిపించారు. టీజర్ లో ఫస్ట్ లుక్ లోనే అందరినీ ఆకట్టుకున్నారు చై.  సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: