మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయనతో పాటు ఎన్టీఆర్ మరో హీరోగా నటించగా రాజమౌళి దర్శకత్వంలో రెండవ సారి సినిమా చేస్తూ మరొకసారి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే పనిలో పడ్డాడు రామ్ చరణ్.  మొదటి నుంచి ఆయన సినిమాల ఎంపిక ఏ హీరో కి సాధ్యం కాని విధంగా ఉందనే చెప్పవచ్చు.

సినిమా పూర్తి కాక ముందే రామ్ చరణ్ తన తదుపరి సినిమా ను భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో చేస్తున్నాడు. తమిళనాట మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాదిన భారీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తూ తొలిసారిగా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న దర్శకుడిగా నిలిచిపోతాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ తో కేటాయిస్తున్నాడు.  రామ్ చరణ్ ఈ విధంగా ఏ హీరో కి సాధ్యం కానీ విధంగా సినిమా చేస్తు దూసుకుపోతున్నాడు. 

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తనదైన వైవిధ్యతను ప్రదర్శిస్తూ ఓ యువ దర్శకుడి తో సినిమా చేస్తున్నాడు. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న గౌతమ్ ఓ అద్భుతమైన కథను రామ్ చరణ్ కు వినిపించి ఆయన ఓకే చెప్పలా చేశాడట. ఇక ఈ దర్శకుడు తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తో చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఏదేమైనా తనకే సొంతమైన రీతిలో సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు రామ్ చరణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: