తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అక్కినేని హీరో నాగచైతన్య ఇప్పుడు హిందీలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఈ మధ్య గత కొద్దికాలంలో యూట్యూబ్ లో విడుదలైన మజిలీ సినిమా కు హిందీ డబ్బింగ్ వర్షన్ ట్రెండింగ్లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. కాగా రీసెంట్ గా జరిగిన లవ్ స్టోరీ ఆడియో లాంచ్ కు బాలీవుడ్  స్టార్ హీరో అయినా అమీర్ ఖాన్ గారు రావడం విశేషం. వీటన్నింటిని బట్టి చూస్తే ఈ యంగ్ హీరో బాలీవుడ్లో కూడా నటించబోతున్నారని తెలుస్తుంది.

దర్శకుడు అద్వైత్ చందన్, నిర్మాతగా అమీర్ ఖాన్, కిరణ్ రావు, రాధిక చౌదరి కలిసి తెరకెక్కించబోతున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా లో అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్లో  అక్కినేని నాగచైతన్య నటించబోతున్నరూ. ఈ సినిమాలో అమీర్ ఖాన్ గారు ఒక ఆర్మీ పాత్రలో నటించబోతున్నారు. అమీర్ ఖాన్ గారు ఆర్మీలో ఉన్నప్పుడు తన స్నేహితుడి పాత్రలో అక్కినేని నాగచైతన్య నటించబోతున్నారు. అంటే నాగచైతన్య గారిది కూడా ఆర్మీ ఆర్మీ పాత్రలో నటించబోతున్నారు. ఈ పాత్రలో నాగచైతన్యకు కాళ్లు ఉండవని బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.

 
నాగ చైతన్య గారు ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు అని కూడా తెలిసింది. రీసెంట్ గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ లో హీరో అమీర్ ఖాన్ గా తో పాటు నాగ చైతన్య ఇంకా కొంతమంది ముఖ్య నటులు పాల్గొన్నారట. ఈ షూటింగ్ లో భాగంగా కొన్ని యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించ్చారు అని బాలీవుడ్ సినీ పరిశ్రమలో టాక్. దాదాపు నెల రోజుల పాటు నాగచైతన్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సీన్స్ ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ డిజైన్ చేస్తున్నారట. ఈ చిత్రం హాలీవుడ్ చిత్రమైన ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: