స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులు కమిట్ అయ్యి ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం 'సర్కారు వారి పాట' చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు ప్రిన్స్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది, చిన్న చిన్న వర్క్స్ మినహా విడుదలకు సిద్దమైనట్టే. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో చిత్రం లైన్ లో ఉంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక గురించి ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు అవసరం ఉండగా ఒకరు పూజ హెగ్డే కాగా, మరొకరు సమంత అని టాక్ వినిపిస్తోంది. కథ ప్రకారం ఇరువురి హీరోయిన్లకు సమానమైన ప్రాధాన్యం ఉండబోతుందని సమాచారం.

ఇటీవలే పూజ హెగ్డే ఈ సినిమాకు సంబందించి కాల్ షీట్ కూడా ఇచ్చినట్లు వినికిడి. కానీ సమంత మాత్రం ఇంకా డేట్స్ ఇవ్వలేదని అంటున్నారు. గతంలో అత్తారింటికి దారేది, అఆ వంటి బిగ్గెస్ట్ హిట్లను సమంతకి అందించారు దర్శకుడు త్రివిక్రమ్. దాంతో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి కాదనకుండా ఒకే చెప్పేశారట సామ్. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ 'భీమ్లా నాయక్' చిత్రంకు సహాయ సహకారాలు అందిస్తూ బిజీగా ఉండగా...ఇటు మహేష్ కూడా సర్కారు వారి పాట సినిమాతో టైట్ షెడ్యూల్ ను కలిగి ఉన్నారు. కాగా ఈ రెండు కంప్లీట్ అవ్వగానే ఈ క్రేజీ కాంబినషన్ కు త్వరలోనే ముహూర్తం పెట్టనున్నట్లు తెలుస్తోంది.

వీరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు రాగా ఇపుడు పదకొండు ఏళ్లు సుదీర్ఘ గ్యాప్  తరవాత మరో చిత్రం రాబోతుంది. దీనితో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి సమంతకు మహేష్ బాబుతో నాలుగవ సినిమా అవుతుంది. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: