రాజమౌళి అంటేనే సినిమాలను శిల్పాలు చెక్కినట్లుగా చెక్కుతాడు అని జక్కన్న పేరు పెట్టేశారు. నిజానికి రాజమౌళికి సినిమాలు అంటే పాషన్ ఉంది. ఆయన ఒక సినిమా తీశాడు అంటే తపస్సులాగే చేస్తాడు. సినిమా ఏళ్లకు ఏళ్లు పట్టనీ కానీ తాను కోరుకున్నట్లుగానే సినిమా చేస్తాడు.

ఈ విషయంలో అసలు రాజీ పడని డైరెక్టర్ ఎవరూ అంటే ఆయన్నే ముందు చెప్పుకోవాలి. ఇక ఆయన రెండు దశాబ్దాల క్రితం డైరెక్టర్ గా వచ్చారు. స్టూడెంట్ నంబర్ వన్ మూవీతో మెగా ఫోన్ పట్టుకున్నారు. కానీ ఇప్పటికి పట్టుమని పదిహేను సినిమాలు కూడా తీసి ఉండరు. అయితేనేమి తీసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టరే. ఇక బాహుబలి తరువాత ఆయన లెవెల్ మొత్తం మారిపోయింది. పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు.

అలాంటి రాజమౌళి ట్రిపుల్ ఆర్ మూవీతో కొత్త ఏడాది తొలి వారంలో జనం ముందుకు వస్తున్నారు. మరి ఆ మూవీ సంగతేంటి అంటే అంతా చాలా క్యూరియాసిటీగానే ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో ప్రతీ చిన్న షాట్ విషయంలో కూడా జక్కన్న ఎక్కడా కాంప్రమైజ్ కాలేదుట. ఆ విషయాలనే జూనియర్ ఎన్టీయార్ తాజాగా చెప్పుకొచ్చారు. లేటెస్ట్ గా రిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేస్తున్న నాట్ నాటు సాంగ్ విషయంలో ఒక చిన్న స్టెప్ విషయంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ ల మధ్య సింక్ కాలేదంటూ దాదాపుగా పద్దెనిమిది టేక్స్ తీసుకున్నాడుట జక్కన్న.

అది సింక్ అయ్యేసరికి ఒకరోజు పట్టింది అని జూనియర్ చెప్పుకొచ్చాడు. అంటే చాలా చిన్నదైన ఆ స్టెప్ విషయంలో కూడా జక్కన్న ఎక్కడా రాజీ పడలేదని, ఇపుడు ఆ స్టెప్స్ చూస్తున్నపుడు చాలా హ్యాపీగా ఉందంటూ రాజమౌళి మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు జూనియర్. రాజమౌళి ఇండియన్ సినిమాకే గ్రేట్ డైరెక్టర్ అని కితాబు కూడా ఇచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: