యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాధేశ్యామ్ ఇంకా విడుదలే కాలేదు. అప్పుడే సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ప్రేక్షకులలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం అనే ఫార్ములా ఫాలో అవుతోంది 'రాధేశ్యామ్'. ప్రభాస్ లాంగ్‌గ్యాప్ తర్వాత చేసిన కంప్లీట్‌ లవ్‌స్టోరీ, రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. నార్త్‌ ఇండియాలో ఏ సౌత్‌మూవీకి లేని ట్రాక్ రికార్డ్‌తో ప్రేక్షకుల ముందుకెళ్తోంది.

ప్రభాస్‌ 'మిర్చి' తర్వాత వారియర్ ఫిల్మ్స్, యాక్షన్‌ మూవీస్‌లోనే కనిపించాడు. 'బాహుబలి'తో అయిదేళ్లు ప్రయాణం చేస్తే, 'సాహో' కోసం రెండేళ్లు తీసుకున్నాడు. ఇప్పుడు 'సలార్' అంటూ మళ్లీ యాక్షన్‌ లుక్‌లోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యలో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో వింటేజ్ లవ్‌స్టోరి 'రాధేశ్యామ్' చేశాడు.

'రాధేశ్యామ్' సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. కరోనా పాండమిక్స్‌తో షూటింగులు ఆగిపోయి 'రాధేశ్యామ్' చాలాకాలం లాక్‌డౌన్‌లోనే ఉంది. దీంతో 'రాధేశ్యామ్' కూడా లాంగ్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్‌గా మారుతుందేమో అని ఇండస్ట్రీలో చాలామందికి డౌట్స్‌ వచ్చాయి. అయితే మేకర్స్‌ కొంచెం రిస్క్ తీసుకుని ఫారెన్‌ షెడ్యూల్స్‌ని స్పీడ్‌గా పూర్తి చేశారు. వచ్చే సంక్రాంతికి జనవరి 14న ఈ సినిమా విడుదలవుతోంది.  

'రాధేశ్యామ్' సినిమా లేట్‌గా వస్తోన్నా, లార్జ్‌స్కేల్‌లోనే రిలీజ్ అవుతోంది. ఈ మూవీ నార్త్‌ రీజియన్‌లోనే 3500 స్క్రీన్స్‌లో రిలీజ్‌ కాబోతోంది. ఒక సౌత్‌ సినిమా నార్త్‌ మార్కెట్‌లో ఇన్నివేల స్క్రీన్స్‌లో విడుదల కావడం ఒక రికార్డ్‌ అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్‌. ఇక 'బాహుబలి2' ఇండియన్‌ మార్కెట్‌లో అన్ని భాషల్లో కలిపి 8000 వేలకి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అయ్యింది. మరి భారీ లెవల్‌లో విడుదల అవుతోన్న 'రాధేశ్యామ్' ఏ రేంజ్‌లో వసూల్‌ చేస్తుందో చూడాలి. చూద్దాం రాధేశ్యామ్ విడుదలయ్యే లోపు మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో. ప్రేక్షకుల అంచనాలను తాకుతుందో లేదో. సినిమా యూనిట్ కు మాత్రం ఆల్ ది బెస్ట్ చెబుదాం.


మరింత సమాచారం తెలుసుకోండి: