ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న హ్యాట్రిక్ మూవీ  పుష్ప ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియా లో దుమ్ము రేపుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ది రైజ్ పేరిట రిలీజ్ డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కొక్కటి ప్రేక్షకుల ముందుకు వస్తోంది అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

 అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రమోషన్స్ తో ఇరగదీసేస్తున్నారు. సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తాం అప్పుడు రిలీజ్ చేస్తాం అంటూ రోజు రోజుకి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకున్నారు. ఇక ఈ సినిమాలోని పాటల గురించి మాట్లాడితే తే ఎక్కడ చూసినా అవే పాటలు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా టీచర్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే తాజాగా యూ ట్యూబ్ లో ఈ సినిమా టీజర్ కి  89 మిలియన్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ అయితే.. 2 మిలియన్ కి పైగా లైక్స్ రావడం అనేది ఎవరి ఊహకి అందనిది. రెండు మిలియన్ల లైక్లను సంపాదించుకున్న పుష్ప సినిమా టీజర్ పాత రికార్డులను బద్దలు కొట్టింది.

 అలాగే కొత్త రికార్డును కూడా సృష్టించింది. దీనితో ఒక రేంజ్ లో పండగ చేసుకుంటున్నారు బన్నీ ఫాన్స్. ఇకపోతే ఈ సినిమా టీజర్ కు ఏకంగా 466కే కామెంట్స్ రావడంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారు అర్థం అవుతోంది. పుష్ప సినిమా పాటలు టీజర్ ఈ రేంజ్ లో ఉంటే మరి సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: