హాస్యనటుడు బ్రహ్మానందం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అయితే తాజాగా బ్రహ్మానందం ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవలే రిలీజ్ అయింది.నవంబర్ 29వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ షో లో తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ అందరిని ఆశ్చర్య పరిచేలా చేశాడు బ్రహ్మానందం. అయితే ఈ షో లో ఆలీ కొన్ని ప్రశ్నలు అడగాలి అందులో భాగంగా బ్రహ్మానందం నీ మీరు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు ఎక్కడ సెటిలయ్యారు అని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.

 అయితే బ్రహ్మానందం ఎందుకురా ఇవ్వన్ని ఇప్పుడు అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే అలీ మనం ముందుగా ఎక్కడ కలిసాము గుర్తుందా అంటూ ప్రశ్నించగా అల్లు రామలింగయ్య గారు చంటబ్బాయ్ సినిమా షూటింగ్ సమయంలో అలీని పరిచయం చేశారని సమాధానమిచ్చాడు బ్రహ్మానందం. అంతేకాకుండా జంధ్యాల ఎక్కడ పరిచయం అయ్యాడు అని కూడా అడిగాడు దానికి స్పందించిన బ్రహ్మానందం నాలో నవ్వించే శక్తి ఉందని మొదటగా గుర్తించిన వ్యక్తి ఆయనే అదెలా మర్చిపోతాను అంటూ కామెంట్లు చేశారు బ్రహ్మానందం. అంతేకాకుండా మొదటగా చిరంజీవి గారితో కలిసి విమానం ఎక్కినట్లు తన అనుభవాన్ని పంచుకున్నాడు.

 సాధారణంగా బ్రహ్మానందాన్ని బ్రహ్మీ అని కూడా పిలుస్తారు అయితే తనని బ్రహ్మానందం అన్నా బ్రహ్మ అన్న తను ఏం అనుకోనని తెలిపారు. అయితే ఇదే క్రమంలో బ్రహ్మానందం తనపై మీన్స్ క్రియేట్ చేసే వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చెప్పారు. అయితే తే.గీ బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు తన సినిమాల్లో కనిపించిన ఎప్పటికీ మీన్స్ తో తనను అందరు గుర్తుపెట్టుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు బ్రహ్మీ. అంతేకాకుండా వివాహ భోజనంబు లో తను చేసిన పాత్రలో మునిగితేలారు అయితే షాట్ గ్యాప్లో ఇసుక లోకి పీకల్లోతు దిగిపోయి ఉన్నానని అదే సమయంలో అక్కడికి వచ్చి ఎత్తడం తో ఏదో చేస్తుందని ఊహించి భయపడ్డాను అంటూ కొద్దిసేపు అందరినీ నవ్వించారు బ్రహ్మానందం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: