ఎన్టీఆర్ ఆర్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ RRR. అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ రూపొందుతోంది. సినిమాలో లో ఎన్టీఆర్ రామ్ చరణ్ స్వాతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే  ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డాయి సినిమా 2022 జనవరి 7న రిలీజ్ కానుంది.  జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌లు నటిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడలో కూడా  విడుదల చేయనున్నారు అయితే అన్ని భాషల్లో కూడ  ఎన్టీఆర్  డబ్బింగ్ చెప్పడం విశేషం. ఎన్టీఆర్ కాకుండా ఇటు రామ్ చరణ్ కూడా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ తానే చెప్పుకున్నారట. వీరిద్దరే కాకుండా అజయ్ దేవ్‌గణ్, ఆలియాతో పాటు మిగతా నటీనటులు డబ్బింగ్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. డబ్బింగ్ లు అయిన వెంటనే ఈ సినిమా ఫైనల్ కట్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. అయితే  అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమాలో ఎలాంటి నెగటివ్ క్లైమాక్స్ ఉండదని ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల మరణానికి సంబంధించి..

 ఈ సినిమాలో ఎటువంటి సీన్ లు ఉండవని వారి ఆందోళనకు సంబంధించిన విషయాలు మాత్రమే చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాటు నాటు అంటూ సాగే మాస్ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టింది. ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి వేసే మా స్టెప్స్ కి యావత్ సినీ ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమా నుంచి మూడో పాట ను కూడా విడుదల చేయనుంది చిత్ర బృందం. 'జనని' అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ నవంబర్ 26న విడుదల కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR