టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా ఉన్నాడు ఎస్.ఎస్.తమన్. పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒక హీరోకి సంగీతం సమకూరుస్తు ఉండగానే అదే రేంజ్ ఉన్న మరొక హీరోకి సంగీతం అందించడం చాలా కష్టం. కానీ తమన్ అవలీలగా ఇద్దరు పెద్ద హీరోలను డీల్ చేస్తూ మంచి సంగీతం అందిస్తూ ఇప్పుడు ఇంతటి స్థాయికి చేరుకున్నాడు. పెద్ద సినిమా ఏది వచ్చినా కూడా తమన్ సంగీతం సమకూర్చాల్సిందిగా హీరోలు అతని అడుగుతూ ఉంటారు.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దాదాపు అందరు హీరోలతో పని చేసిన తమన్ ఒక హీరోకు మాత్రం పని చేయకపోవడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ఇతర భాషల నుంచి సైతం ఆయనకు మంచి మంచి ఆఫర్లు వస్తుంటాయి. అందరూ పెద్ద హీరోలు రేకమెండేశన్ ల మీద తమన్ సంగీతం చేయించుకుంటారు కానీ ప్రభాస్ మాత్రం తన సినిమాలకు ఇప్పటి వరకు సంగీతం సమకూర్చుకోలేకపోవడం ఇప్పుడు ఎందుకు ఈ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అన్న అనుమానాలకు తావిస్తోంది.

నిజానికి లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన రెబల్ సినిమాకి తమన్ సంగీతం అందించాల్సి ఉంది కానీ అనూహ్యంగా ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం లారెన్స్ సంగీతాన్ని సొంతంగా సమకూర్చడం వంటివి జరిగాయి. అయితే ఆ సినిమా భారీగా ఫ్లాప్ కావడంతో ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఆయన ఈ సినిమా నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సేస్ కారణల వల్లనే తాను ఈ సినిమా నుంచి వాకౌట్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ సినిమాకి సంగీతం అందించే సమయంలో తమన్ కు మంచి రేంజే ఉందని చెప్పాలి. అప్పటికే పెద్ద హీరోలకు సంగీతం సమకూరుస్తున్న తమన్ ప్రభాస్ కు భవిష్యత్తులో ఎప్పుడు సంగీతదర్శకుడిగా పని చేస్తాడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: