తనకు వస్తున్న పెద్ద సినిమా ల ఆఫర్ ల వల్ల చిన్న సినిమాలు చేయడం పూర్తిగా ఆపేసాడు తమన్. ప్రస్తుతం పెద్ద సినిమాలను మాత్రమే చేయాలని ఆయన నిర్ణయించుకోవడంతో కొన్ని సినిమాలను మధ్యలోనే వదిలేయక తప్పట్లేదు. అలా ఆయన సంగీతం  అందిస్తున్న క్రేజీ సినిమా అఖండ. డిసెంబర్ 2 న రాబోతున్న ఈ సినిమా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తమన్. నందమూరి బాలకృష్ణకు ఆయన గతంలో కూడా కొన్ని సినిమాలకు పాటలు అందించగా ఇప్పుడు భారీ స్థాయిలో రాబోతున్న ఈ చిత్రానికి ఆయన సంగీతం అందించడం విశేషం.

భద్ర సినిమా తో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమై మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు చాలు అన్నట్లు ఒక స్టార్ డైరెక్టర్ పుట్టాడో లేదో అని తెలియడానికి ఒక్క సినిమా చాలు. ఆ విధంగా తొలి సినిమాతోనే బోయపాటి శ్రీను స్టార్ దర్శకుడిగా ఎదిగాడు. భద్ర చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో అందరికీ తెలిసిందే.  రవితేజ కెరీర్ ను మార్చేసిన సినిమా భద్ర.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించారు తమన్.  తాను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించాను కానీ వాటిలో అఖండ సినిమాకు సంగీతం అందించే సమయంలో ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాత్ర అయిన అఘోర పాత్ర కు సంగీతం అందించడంలో చాలా రీసెర్చ్ చేశారట తమన్. ఆఘోరాలు ఎలా ఉంటారు.. వారి తాలూకు జీవన విధానం ఎలా ఉంటుంది.. అనేది తెలుసుకుని మరి ఈ పాత్ర వచ్చే సమయంలో ఆయన నేపథ్య సంగీతాన్ని సమకూర్చారట. ఇప్పటికే ఆయన సంగీతం అందించిన ఓ పాట విడుదలై యూట్యూబ్లో సెన్సేషనల్ హిట్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: