నందమూరి బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అఖండ. ఎన్నో రోజు ల నుంచి నందమూరి అభిమాను లు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ఇప్పుడు ఆ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల అవుతుండడం ఒక్కసారిగా ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెట్టింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ మూడవ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టి తమ కాంబినేషన్ కు తిరుగులేదు అని చాటి చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు బోయపాటి శీను సినిమాలు మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే విధంగా ఉండటంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా బాగానే అలరించాయి. ఆ నేపథ్యంలో అఖండ సినిమా కూడా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ చెబుతుంది మాత్రం వేరే.. 

సినిమా మాస్ ప్రేక్షకులను మాత్రమే కాదు కుటుంబ కథా ప్రేక్షకులను మాత్రమే కాదు ఎమోషనల్ గా సినిమాలను చూసే వారి ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ఫైట్లు సెంటిమెంట్ తో పాటు ఎమోషన్ కూడా కీలక పాత్ర వహిస్తుందని చెబుతున్నారు. ఏదేమైనా హిట్ కొట్టి చాలా రోజు లు అయిపోయి నా నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఇప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ రావడం అందరికీ ఎంతగానో సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ ఖుషీ గా ఉన్నా రు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటించిన ఈ సినిమా లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నా డు. ఒకటి అఘోర పాత్ర కాగా మరొ క పాత్ర ఫ్యాక్షనిస్టు పాత్ర అని ఇప్పటికే వచ్చి న అప్డేట్స్ ని బట్టి తెలియజేశాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: