అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన `ఎఫ్ 2` ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిన విషయమే. వెంకటేష్ కామెడీ టైమింగ్ అలాగే వరుణ్ తేజ్ పంచ్ లు..తమన్నా, మెహ్రీన్ గ్లామర్ కు తోడు రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ నటులు తోడవడంతో అనిల్ రావిపూడి కథ నెక్ట్స్ లెవిల్ కు వెళ్ళిందట.ఈ సినిమా సక్సెస్ తర్వాత సీక్వెల్ గా `ఎఫ్ 3`(F3) తెరకెక్కుతోందని తెలుస్తుంది . వాస్తవానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదలకు ప్రకటించారట.. ఇక ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఓ విశేషం దర్శకుడు అనీల్ రావిపూడి వివరించారని తెలుస్తుంది.

అనీల్ రావిపూడి మాట్లాడుతూ... f3 చిత్రంలో పాన్ ఇండియా సర్పైజ్ క్లైమాక్స్ లో ఉందని ఇప్పుడు ఏమీ చెప్పను కానీ థియోటర్ లో ఆ పోర్షన్స్ చూసినప్పుడు జనం బాగా ఎంజాయ్ చేస్తారని ఇక నేను ప్యాన్ ఇండియా సినిమాని భవిష్యత్ లో ఖచ్చితంగా ట్రై చేస్తానని చెప్పాడట.అయితే నేను ఎంచుకున్న కథలో ఆ పొటిన్షిల్ ఉండాలని తెలుగులో సినిమాలు తెరకెక్కించటంలో నాకు చాలా కంఫర్ట్ ఉందని ఎఫ్ 2తో పోలిస్తే ఎఫ్‌ 3 సినిమాలో ఫన్ అండ్ గ్లామర్ డోస్ పెంచిన అనిల్ రావిపూడి ఈ సీక్వెల్ కోసం తమన్నా, మెహరీన్ కు తోడుగా సోనాల్ చౌహన్ ను కూడా తీసుకున్నారట.

అలాగే ఈ సినిమాలో వెంకటేష్ కు రేచీకటి మరియు వరుణ్ తేజ్ కు నత్తి ఉంటాయట. అయితే అవి కథను ఏ మాత్రం డిస్ట్రబ్ చేయవని అలాగే అవి కొన్ని సీన్స్ లో మాత్రమే వాడటం జరిగిందట  ఇప్పటిదాకా ఈ సినిమా షూటింగ్ 80% పూర్తైందని. టాకీ పార్ట్ కొంత మరియు పాటలు బాలెన్స్ ఉన్నాయట డిసెంబర్ కు మొత్తం టాకీ పూర్తవుతుందని తెలుస్తుంది.

ఇక ఎఫ్ 2 కథ భార్యా,భర్తల మధ్య జరుగుతుందని అయితే ఎఫ్ 3 చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుందని సునీల్, మురళి శర్మసినిమా కొత్తగా కలుస్తారట.. సరిలేరు నీకెవ్వరు వంటి సీరియస్ సబ్జెక్టు తర్వాత నేను చేస్తున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ఇదని ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్సపెక్టేషన్స్ రీచ్ అవుతాము అన్నారట."దృశ్యం 2" ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో వెంకటేష్సినిమా విడుదల గురించి స్పందించారట.. వెంకీ 'ఎఫ్ 3' సంక్రాంతికి విడుదల కాబోదని క్లారిటీ ఇచ్చేశాడట.. 'ఎఫ్ 3' వేసవిలో విడుదలవుతుందని అలాగే ఇప్పటి వరకు సినిమా 70 శాతం షూటింగ్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసిందని వెంకీ మామ చెప్పాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: