ప్రస్తుతం బిగ్బాస్ కార్యక్రమం రోజురోజుకు రసవత్తరం గా మారిపోతుంది. ఇక ప్రస్తుతం బిగ్బాస్ చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. దీంతోబిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో ఎవరు నిలువబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఇటీవలే అనీ మాస్టర్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం ఇంట్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇటీవలే బిగ్ బాస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ కంటెస్టెంట్ కి ఇవ్వగా అందరూ ఎంతగానో 100% ఆడుతున్నారు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో జర్నీ కాస్త దగ్గర పడుతుండడంతో ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.



 అయితే బిగ్ బాస్ హౌస్ లో ఒక మంచి స్నేహ బంధం మొదటినుంచి తెలుగు ప్రేక్షకులు అందరిని ఆకర్షిస్తుంది. సన్నీ, మానస్ మనసు మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఒకానొక సమయంలో బిగ్ బాస్ హౌస్ లో నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికాడు అంటూ సన్నీ కూడా చెప్పడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు హౌస్ లో అందరి తో గొడవ పడిన సన్నీ బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న మానస్ తో మాత్రం ఒక్కసారి కూడా గొడవ పడలేదు అనే చెప్పాలి. దీంతో వీరిద్దరి ఫ్రెండ్షిప్ కాస్త అందరినీ ఆకర్షిస్తోంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న వీరిద్దరి మధ్య ఇటీవల గొడవ జరిగింది అని తెలుస్తోంది.



 ఇటీవలే బిగ్బాస్ నేటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కాస్త విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా కెప్టెన్సీ టాస్క్ లో బాగా ఆడి ఉంటే బాగుండేది అని సన్నీ ప్రియాంకకు చెబుతాడు. ఆ తర్వాత తల మీద కొట్టుకున్నా ప్రియాంక అంతా నాదే తప్పు అంటూ ఏడుస్తుంది. ఇక ఆ తర్వాత కాజల్ మానస్ పింకీ సన్నీ అందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుతున్న సమయంలో మానస్ సన్నీ మధ్య గొడవ జరుగుతుంది. పింకీ ఈ విషయంలో వీరిద్దరూ ఒకరి పై ఒకరు గట్టిగా కోపంతో అరుచుకుంటారు . దీంతో వీరి గొడవ తర్వాత వీరు మళ్లీ మాట్లాడుకుంటారా లేదా అన్నది మరో టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: