సాధారణంగా సినిమా అంటేనే ఊహాగానం అయినా అయుండాలి లేదా ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చోట జరిగిన యదార్థ సంఘటన అయినా అయి ఉండాలి.. లేదా రచయితలు వారు ఎక్కడైనా చూసిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఊహాగానాలను జోడిస్తూ ఒక అద్భుతమైన కథను తెరకెక్కించడం వంటివి జరుగుతూ ఉంటాయి. కానీ భవిష్యత్తులో సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఎవరైనా దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కిస్తారా..?? ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించే లోపే అవునని చెప్పాలి..!! ఎందుకంటే ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పటికే ఆయన నటించిన ఎన్నో సినిమాలు సామాజిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కినవే..


అందులో వచ్చిన సెవెంత్ సెన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చైనా దేశస్తులు ఒక వైరస్ ను మన భారతదేశం పై వదిలి భారతీయ ప్రజలకి తీవ్రంగా ఆర్థిక, ప్రాణ నష్టం కలిగించి ఎంత తిప్పలు పెట్టారో ఆ సినిమాలో చక్కగా చూపించారు.. కానీ  నిజజీవితంలో కరోనా మహమ్మారి చైనా దేశస్థుల నుంచి వ్యాపించి  కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ గత రెండు సంవత్సరాలుగా గడగడలాడిస్తోంది.. ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులలో ఎంతో మంది ఆర్థిక, ప్రాణ నష్టాన్ని చవి చూస్తున్నారు.


ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా బందోబస్త్..స్వార్థపరులైన వ్యాపార వేత్తలు తమ వ్యాపార రంగాలను అభివృద్ధి చేసుకోవడం కోసం రైతన్నలను నాశనం చేయాలి.. పంట భూములు లేకుండా ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలను నిర్మించాలి అని, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలనే  ఆలోచనతో పంటలపై కి మిడత అనే పురుగులను వదిలిన దృశ్యాన్ని మనం ఈ  సినిమా లో చూడవచ్చు. కానీ విచిత్రం ఏమో తెలియదు కానీ నిజజీవితంలో కూడా మొన్నామధ్య గుజరాత్లో మొదలైన ఈ మిడతల గుంపు తెలంగాణ రాష్ట్రం,  ఖమ్మం జిల్లా తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయదుర్గం వంటి మండలాలలో కూడా గుంపులు గుంపులుగా వచ్చి ప్రజలకు పంట నష్టం కలిగించాయి.

ఇలా ఈ రెండు సినిమాలు కూడా ఎవరో భవిష్యవాణి చెప్పినట్టుగా ముందే హెచ్చరిక జారీ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: