సాధారణంగా కొంతమంది సినిమాలో కామెడీ చేయడానికి తెగ కష్టపడి పోతుంటారు . పంచు డైలాగులు వేసి ఇక ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా పంచ్ డైలాగులతో ప్రేక్షకులు నవ్విస్తే..  కొన్నిసార్లు మాత్రం ఎంత ప్రయత్నించినా ప్రేక్షకులకు మాత్రం నవ్వు రాదు. అయితే ఇదంతా మిగతా వారికి.. ఆయనకు ప్రేక్షకులను నవ్వించడం పెద్ద పని కాదు. అయితే ప్రేక్షకులను నవ్వించాలి అంటే ఆయన పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. పెద్ద పెద్ద పంచ్ డైలాగులు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు.. ఒక్కసారి తెరమీద కనిపించారు అంటే చాలు ఆయన ముఖం చూస్తే ప్రేక్షకులు పగలబడి నవ్వుకుంటారు. ఆయన చిన్న ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు అంతే చాలుఇక అంతే పొట్ట చెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాల నుంచి హాస్యనటుడిగాఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు హాస్యబ్రహ్మ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు బ్రహ్మానందం. బ్రహ్మానందం పేరు చెబితే చాలు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు చిగురిస్తుంది. అంతలా తన కామెడీ టైమింగ్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు బ్రహ్మానందం. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా అంతే సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉంటారు.
 అయితే ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్  గా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చిరంజీవి తో ఏర్పడిన పరిచయం ఆయనతో ఉన్న సంబంధం గురించి చెప్పుకొచ్చారు. చిరంజీవిని మీరు ఎక్కడ కలిశారుఅంటూ వ్యాఖ్యాతగా ఉన్న అలీ ప్రశ్నించాడు  ఒక సినిమా సమయంలో జంధ్యాల గారు నన్ను చిరంజీవి గారికి పరిచయం చేస్తూ.. ఈయన పేరు బ్రహ్మానందం కాలేజీ లెక్చరర్ అని చెబుతారు.. అది ఎంతవరకూ నిజమన్నది మాత్రం నాకు కూడా తెలియదు అంటూ పరిచయం చేశారు. ఇక ఆ తర్వాత చిరంజీవితో మాట్లాడుతున్న సమయంలో మీరు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు నాతో రండిసినిమాలో ఎలా నటించాలో నేను చూసుకుంటాను అంటూ చెప్పి తనతో పాటు చిరంజీవి తీసుకెళ్లారు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు బ్రహ్మానందం. ఇక తాను మొదట విమానం ఎక్కింది కూడా చిరంజీవితోనే అనీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: