కోలీవుడ్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన సూర్య.. ఎన్ని సినిమాలలో నటించినా తప్పకుండా ఆ సినిమా ద్వారా సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. అలా ఆయన ఎక్కువగా సామాజిక దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి మంచి కథలతో సినిమాలలో నటిస్తూ వుంటాడు. అయితే కచ్చితంగా సూర్య సినిమా వస్తోంది అంటే అది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా యదార్థ సంఘటన అని కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఉంటుంది. 

90 లలో కూడా జరిగిన కొన్ని యదార్థ సంఘటనలు ఆధారంగా తీసుకొని తన సినిమాల ద్వారా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటాడు. ఈమధ్య జై భీమ్ అనే సినిమాతో గిరిజన ప్రాంతీయ వాసులు అప్పట్లో ఎలా ఉండేవారు..? వారి సమస్యలు ఏమిటి..? వారి జీవన విధానం ఎట్టిది ..? అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా కళ్ళకు అద్దినట్టుగా చూపించాడు. ఇక ఎవరికీ తెలియని ప్రముఖ లాయర్ చంద్రు గొప్పతనాన్ని కూడా ఈ తరం యువతకు తెలిసేలా చేశారు.

ఇక సూర్య నటించిన అలాంటి సినిమాలలో సెవెంత్ సెన్స్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కధ విషయానికి వస్తే చైనా దేశంలో ఒక వైరస్ ను పుట్టించి,  దానిని భారతీయుల మీద ప్రయోగం చేసి , వ్యాక్సిన్ లేని  సమయంలో ఆర్థిక నష్టం,  ప్రాణనష్టం జరుగుతున్నప్పుడు చివరి క్షణాల్లో అత్యధిక ఖర్చుతో వ్యాక్సిన్  ఇస్తామంటూ ప్రజలను మోసగించి,  చైనా వాసులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ సొమ్ము చేసుకున్నట్టుగా చూపిస్తారు. కానీ బోధిధర్మ చెప్పిన ఆయుర్వేద సూత్రాలను ప్రజలు ఆచరించేలా చేసి ఆ వైరస్ నుంచి ప్రజలను కాపాడాడు హీరో.. ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు.

ఇక దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత కరోనా మహమ్మారి చైనా దేశం నుండి పుట్టుకొచ్చి ప్రపంచ ప్రజలందరినీ వణికిస్తోంది. ఆర్థిక నష్టం , ప్రాణ నష్టం తో పాటు  ఎంతో మంది పిల్లలు ఒంటరి వాళ్ళయ్యారు. ఇక ప్రస్తుతం భయపడుతూనే ప్రజలు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. సెవెంత్ సెన్స్ సినిమా లో చూపించిన సరికొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశ ప్రజలందరినీ భయపెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: