కొరటాల సినిమా అంటే కమర్షియల్ అండ్ సోషల్ మెసేజ్ మూవీ. అయితే కొరటాల ఇప్పటి వరకూ చేసిన ప్రతి సినిమాలోనూ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చారు. అయితే అన్ని సినిమాల్లోనూ కొరటాల ఒక ఒక కీలకమైన కామన్ పాయింట్ ను టచ్ చేస్తారు. ముఖ్యంగా ఆయన ప్రతి సినిమాలోనూ భూమి, పర్యావరణం, వ్యవసాయం ఇలా అన్నింటిలోనూ భూమికి సంబంధించిన అంశాన్ని ఒక్క సన్నివేషంలోనైనా చూపిస్తారు.

మిర్చి
ప్రభాస్, అనుష్క జంటగా నటించిన ఈ సినిమాలో 'పండగలా దిగి వచ్చావు' సాంగ్ లో ప్రభాస్ వ్యవసాయం చేస్తున్నట్టుగా చూపించి, ఆయన లోని సరికొత్త కోణాన్ని బయటకు తీసుకొచ్చారు. అలాగే ప్రభాస్ క్రేజ్ ను మరింతగా పెంచేశారు. విలేజ్ లో మన మిర్చి లాంటి కుర్రాడు చేసే పనులు ఆకట్టుకుంటాయి.

శ్రీమంతుడు
శ్రీమంతుడు సినిమాలోనూ మహేష్ బాబుతో ఒక ఊరిని దత్తత తీసుకునేలా చేయించాడు. విలన్ కారణంగా అక్కడ వ్యవసాయం చేయలేక ఆ ఊరి నుంచి అందరూ వెళ్ళిపోతారు. రైతుల భూములను కొనుగోలు చేసి అక్కడ ఫ్యాక్టరీని నిర్మించాలన్న విలన్ ఆలోచనను శ్రీమంతుడుగా మారి మహేష్ ఎలా తుంచేశాడు అనేది మనం థియేటర్లలో చూశాము.

జనతా గ్యారేజ్
జనతా గ్యారేజ్ లో 'ప్రణామం ప్రణామం' అంటూ ఎన్టీఆర్ పాడడం, అలాగే 'రాక్ ఆన్ బ్రో' అంటూ స్నేహితులతో కలిసి ఆయన వేసిన ట్రిప్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక చోట ఈ అంశాన్ని టచ్ చేసే కొరటాల ఈ సినిమాలో సాంగ్ ద్వారా చూపించాడు.

భరత్ అనే నేను
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్ ఒక ఊరిని పర్యటిస్తున్నప్పుడు అక్కడ రైతు కన్పిస్తాడు. అక్కడక్కడా నీళ్ళు కన్పించవు. మరి వ్యవసాయం ఎలా చేస్తారని అడగ్గా, ఆ రైతు వర్షం నీటితో అని చెప్తాడు. వర్షం పడకపోతే అని మహేష్ అడగ్గా... వర్షం పడితే ఆ నీటి చుక్కలతో పంట పాడిస్తాను. లేదంటే అదే రెండు చుక్కల మందు తాగి నేనే పైకెళ్తాను' అనే డైలాగ్ తో మనసుని కదిలించే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: