నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తన సినిమా కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడమే కాకుండా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి గతంలో చేసిన తప్పులు చేయకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతోంది అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. గతంలో బాలీవుడ్ లో సినిమాలో సమంత ఎప్పుడూ చేసిన సందర్భం లేదు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో సమంత బాలీవుడ్ ప్రాజెక్టుల మీద కూడా దృష్టి పెడుతుందని ఈ నేపథ్యంలోనే కొంత మంది అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసేందుకు కూడా రెడీ అవుతుందని హీరోయిన్ పాత్ర మాత్రమే కాకుండా నా పాత్రకు ప్రాధాన్యత మాత్రం ఏ పాత్రైనా చేయడానికి రెడీ అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం సమంత ఏ విధంగా అయినా సరే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందని ఈ నేపథ్యంలో ఒక స్టార్ హీరోయిన్ తో చర్చ జరుగుతుందని సమాచారం. అయితే సమంత ఇప్పుడు ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈ సినిమాలో సమంత మరియు బోల్డ్ గా కనబడే అవకాశం ఉంటుందని ఆ పాత్రలో సమంత కాస్త గతంలో కంటే కొత్తగా ఉంటుందని సమాచారం. ఒక క్రికెట్ బెట్టింగ్ మాఫియా కు సంబంధించి ఈ సినిమా ఉంటుందని ఈ సినిమాలో ఆమె పాత్ర ఐటమ్ గర్ల్ గా ఉంటుందని తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు ఆమెకు కథ కూడా చెప్పారని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో దర్శకుడు ఆమె పాత్రను ముందుకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇక ఈ పాత్రకు ఆమె భారీగా డిమాండ్ చేయలేదని సోషల్ మీడియా ప్రమోషన్ విషయంలో మాత్రం కాస్త ఇబ్బందికరంగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి సమంత ఎంతవరకు సహకరిస్తుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: