కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన' శ్రీమంతుడు' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాజిక నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింపజేసే విధంగా కూడా చేసింది. ఊరిని దత్తత తీసుకోవడం అనే  కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. నిజానికి మన తెలుగు లో సోషల్ మెసేజ్తో కూడిన సినిమాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి. అందులో శ్రీమంతుడు సినిమా మాత్రం ఆడియన్స్ దృష్టిలో ఎప్పటికీ ఓ ప్రత్యేక సినిమాగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

 ఇక శ్రీమంతుడు సినిమా స్ఫూర్తితో నిజజీవితంలో కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు ఒక ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరిని అభివృద్ధి చేశారు. అందుకు మన మహేష్ బాబు కూడా అతీతం కాదు. ప్రస్తుతం మహేష్ బాబు ఓ ఊరిని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరి కొంత మంది రాజకీయ నాయకులు సైతం ఈసినిమా స్ఫూర్తితోనే కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. జనాల పై అంతలా ప్రభావం చూపించింది శ్రీమంతుడు సినిమా. ఇక ఈ సినిమా రికార్డుల విషయానికి వస్తే.. దాదాపు 185 కేంద్రాల్లో 50 రోజులు.. 15 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60 కోట్ల షేర్ని రాబట్టింది.

 ఇక ఓవర్సీస్లో 13 కోట్ల వరకు రాబట్టింది. మొత్తంగా 86 కోట్ల షేర్ని 146 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని సాధించి సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను సాధించిన మొట్టమొదటి తెలుగు సినిమా శ్రీమంతుడు రికార్డు నమోదు చేసింది. అతి తక్కువ సమయంలోనే ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన తొలి సినిమా శ్రీమంతుడు. 2015 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాతో మొదటి విజయాన్ని అందుకుంది మైత్రి మూవీ మేకర్స్. దాని తర్వాత వరుస విజయాలు అందుకుంటూ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే మంచి సామాజిక కథాంశంతో ప్రేక్షకులను అలరించడం తోపాటు ఆలోచించే విధంగా చేసిన సినిమా శ్రీమంతుడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: