మెగా ఫ్యామిలీ లో గారాలపట్టి గా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక అందరి మధ్య ఎంతో గౌరవంగా.. అల్లారుముద్దుగా పెరిగింది. ఇక మెగా ఫ్యామిలీ అనే నీడ పడకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని యాక్టర్ గా, హీరోయిన్ గా, హోస్ట్ గా, యాంకర్ గా, నిర్మాతగా కూడా తనలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది నిహారిక. అయితే తాజాగా ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం కి అతిథిగా వచ్చిన నిహారిక కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకుంది.

ఇక ఆ ప్రోగ్రాం లో నిహారిక మాట్లాడుతూ.. మేము ఇప్పుడు మా నాన్న ఇంట్లో ఉండడం లేదు అని తెలిపింది. అంతేకాదు అత్తింటి వారి ఇంట్లో కూడా ఉండడం ఇష్టం లేదని నిహారిక చెప్పుకొచ్చింది. నేను నా భర్త అత్తారింటికి , పుట్టింటికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలని , అందుకే ఇద్దరం పక్కన ఫ్లాట్ తీసుకోని ఉంటున్నామని నిహారిక తెలిపింది.. ప్రస్తుతం మా దగ్గర ఎవరు లేరు.. చిన్నప్పటి నుంచి కూడా మా పెద్ద కుటుంబంతో చాలా అల్లారుముద్దుగా పెరిగాను. ఎప్పుడూ నేను ఒంటరిగా లేను.. కాబట్టి ప్రస్తుతం నా భర్తతో కలిసి ఒంటరిగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని నిహారిక చెప్పుకొచ్చింది.

స్కూలింగ్ చదివేటప్పుడు హాస్టల్ గర్ల్స్ ఎవరైనా ట్రిప్ కి వెళ్తే కేవలం మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు మా కుటుంబాన్ని విడిచి వెళ్ళ లేదు. ఇప్పటికీ కూడా నా కుటుంబాన్ని విడిచి ఉండడం కష్టం గా అనిపించినా భర్తతో కొద్ది రోజులు ఫ్రీ గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆమె తెలిపింది. నిహారిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కేవలం వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. సొంత ప్రొడక్షన్ బ్యానర్లో ఓటీటీ పైనే తన వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ , నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంటోంది నిహారిక.

మరింత సమాచారం తెలుసుకోండి: