తెలుగు సినిమా ప్రేక్షకుల‌ లోనే కాకుండా తెలుగు సినీ అభిమానులు లోనే... కాకుండా యావత్ తెలుగు ప్రజలందరిలో నంద‌మూరి కుటుంబం అంటే ఎంత‌ ప్రత్యేకమైన క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ నటుడు నటరత్న ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయి. ముఖ్యంగా పౌరాణికం గా చూస్తే ఒక రాముడు  - ఒక కృష్ణుడు -  ఒక దుర్యోధనుడు - ఒక విశ్వామిత్రుడు - ఒక కర్ణుడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ దేవుళ్లను చూస్తే నిజంగా ఎన్టీఆర్ రూపమే గుర్తుకు వచ్చేలా తెలుగు ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఇద్దరు వారసులు నందమూరి హరికృష్ణ - నందమూరి బాలకృష్ణ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

ఇక మూడో తరం లో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , తారకరత్న కూడా సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నందమూరి కుటుంబం ముందువరుసలో ఉండేది. అప్ప‌ట్లో దివిసీమ వ‌ద‌ర‌లు వ‌చ్చిన‌ప్పుడు ఎన్టీఆర్ స్వ‌యంగా జోలి ప‌ట్టి మ‌రీ విరాళాలు సేక‌రించి స‌హాయ నిధికి ఇచ్చారు. ఎన్టీఆర్ స్వ‌యంగా సాయం చేయ‌డంతో పాటు ఆయ‌న స్వ‌యంగా జోలి ప‌ట్టి మ‌రీ విరాళాలే సేక‌రించారు. ఇక ఆయ‌న అభిమానుల‌కు కూడా విరాళాలు ఇచ్చి దివిసీమ బాధితుల‌ను ఆదుకోవాల‌ని పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ పిలుపుతో నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో  మంది స్వ‌చ్ఛందంగా విరాళాలు ఇచ్చి ఆదుకున్నారు.

నాడు ఎన్టీఆర్ పిలుపు ఓ ప్ర‌భంజ‌నం క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు రాయ‌ల‌సీమ లో వ‌ద‌ర‌లు వ‌చ్చి మూడు జిల్లాలు విల‌విల్లాడుతున్నాయి. అయినా కూడా ఎక్క‌డా నంద‌మూరి వార‌సులు స్పందించ‌డం లేదు. ఇప్ప‌ట‌కీ అయినా నంద‌మూరి వార‌సులు మ‌రి బ‌య‌ట‌కు వ‌చ్చి ఈ విష‌యంపై స్పందిస్తారా ?  సినిమా మీద తొడ‌లు కొట్ట‌డం కాకుండా సీమ‌ను ఆదుకునే విష‌యంలో తాము ముందుంటామ‌ని రొమ్ము విరిచి చెపుతారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: