ప్రజలకు కష్టాలు వస్తే ఆదుకునే వారిలో సినిమా హీరోలు చాలా వెనుక అడుగు వేస్తూ ఉంటారు అనే మాట వాస్తవం. మన తెలుగులో చాలా మంది హీరోలు సామాజిక సేవా కార్యక్రమాలకు దాదాపుగా దూరంగా ఉండటం అనేది ఈ మధ్యకాలంలో బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇతర భాషల హీరోలు ముందుకు వస్తూ తన అభిమానులకు ఏదైనా కష్టం వస్తే వెంటనే ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా సరే మన తెలుగులో మాత్రం అటువంటి పరిస్థితి కనపడటం లేదు అనే మాట వాస్తవం.

ప్రస్తుతం మన తెలుగులో ముగ్గురు లేదా నలుగురు హీరోలు మినహా పెద్దగా ఎవరూ కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి గాని ప్రజలకు సహాయం చేయడానికి గానీ లేదంటే ప్రాంతాలకు ఏదైనా కష్టాలు వచ్చినా సరే దానికి సంబంధించి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం కాస్త ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు సినిమా పరిశ్రమ మీద చాలా సీరియస్ గా ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం మన తెలుగు సినిమాల్లో చాలా మంది హీరోలు రాయలసీమ నేపథ్యంలో సినిమాలను చేస్తూ కాస్త సందడి చేస్తూ ఉన్నా సరే ఇప్పుడు అదే రాయలసీమకు కష్టం వస్తే మాత్రం ముందుకు రాకపోవడం పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కడప చిత్తూరు అలాగే అనంతపురం జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు ఇబ్బంది పెట్టినా సరే చాలా మంది అగ్ర హీరోలు వివరాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఆగ్రహం పెరుగుతుందని చెప్పాలి. ఇక చాలామంది స్టార్ హీరోలు కనీసం ఈ వరదల గురించి సోషల్ మీడియాలో కూడా స్పందించి ప్రయత్నం చేయకపోవడం పట్ల కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: