తెలుగు చిత్ర పరిశ్రమలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కొరటాల శివ. సాధారణంగా స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ ఉంటే దర్శక నిర్మాతలందరూ కూడా ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి అని భావిస్తూ ఉంటారు. కానీ కొరటాల శివ మాత్రం ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యే ఒక మెసేజ్ పెట్టాలి అని భావిస్తూ ఉంటాడు. ఇలా ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించి ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకుడు గా కొనసాగుతున్నాడు దర్శకుడు కొరటాల శివ.



 ఇలా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఒక ఆణిముత్యం లాంటి సినిమా జనతా గ్యారేజ్. ఈప్రకృతిని పెద్దలను ఎలా గౌరవించాలి అనే విషయాన్ని ఎంతో క్లారిటీ గా చూపించాడు కొరటాల శివ. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అన్న విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో చెప్పేందుకు ప్రయత్నాలు చేశాడు. అంతేకాదు ఇక ఇంట్లో ఉండే పెద్దలను ఎలా గౌరవించాలి.. వారితో ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్ని కూడా చెప్పాడు కొరటాల శివ. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.



 ఇక జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంత తో పాటు నిత్య మీనన్ కూడా నటించింది ఈ సినిమాలో. ఇక వీరిద్దరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకం గానే ఉంటాయి అని చెప్పాలి. ప్రజలకు ఏమైన అన్యాయం జరిగితే అస్సలు తట్టుకోలేని వ్యక్తి ఒక వైపు.. ప్రకృతికిఏమైనా ప్రమాదం జరిగితే అసలు సహించలేని హీరో ఒకవైపు ఇక ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఇక ఈ సినిమా. మంచి మెసేజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్పాలి. సినిమా లోని స్టొరీ ప్రేక్షకులందరికీ కూడా బాగా కనెక్ట్ అయి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: