ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులందరి కన్ను కూడా బిగ్ బాస్ షో పైనే ఉంది. బిగ్ బాస్ హౌస్ లో చివరిరోజుల్లో ఎవరు టాస్క్ బాగా ఆడుతున్నారు. ప్రేక్షకులను ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తున్నారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో గేమ్ ఆడుతూ టైటిల్ విన్నర్ గా నిలవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇటీవలే చివరి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ జరిగింది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్గా ఎవరు నిలువ బోతున్నారు అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే  ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కెప్టెన్సీ దక్కించుకునేందుకు బిగ్బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కి ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ కాజల్ ను కంట తడి పెట్టేలా చేసింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరుతెచ్చుకుంది కాజల్. కానీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా కెప్టెన్సీ దక్కించుకోలేక పోయింది అని చెప్పాలి. ఎన్నోసార్లు కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేసినప్పటికీ కెప్టెన్సీ మాత్రం దక్కించుకోలేకపోయింది కాజల్.


 అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ లో అయినా తనకు అదృష్టం వరిస్తుంది అని కాజల్ ఎంతగానో ఆశలు పెట్టుకుంది. కానీ చివరికి అది కుదరక పోవడంతో బోరున ఏడ్చేసింది కాజల్. టాస్క్ లో భాగంగా నియంత సింహాసనంపై ఎవరు కూర్చుంటారు వారు సేఫ్ అవుతారు. మరో టాస్క్ లో ఓడిన ఇద్దరిలో ఒకరిని నియంత సేవ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఇక కుర్చీ మీద కూర్చున్న నియంత టాస్క్ లో శ్రీ రామచంద్ర చంద్ర విను అవ్వగా ఆ తర్వాత టాస్క్ లో చివరిలో నిలిచారు రవి, కాజల్. ఈ క్రమంలోనే మనస్ఫూర్తిగా నిన్ను సేవ్ చేయాలని ఉంది కానీ నేను మాత్రం రవికి సపోర్ట్ చేస్తాను అంటూ శ్రీ రామచంద్ర చెబుతాడు. దీంతో కాజల్ బాత్రూం లోకి వెళ్లి డోర్ వేసి  గట్టిగా ఏడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: