శర్వానంద్ హీరోగా సాయికుమార్ ప్రధాన పాత్రలో దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రస్థానం. 2010 లో విడుదలైన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే ఈ చిత్రం ప్రతి ఒక్కరిపై ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.  పదేళ్ల తర్వాత కూడా ఈ సినిమాకు డబ్బింగ్ రైట్ ఆఫర్స్ వచ్చాయి. హిందీలో ఇదే పేరుతో సంజయ్ దత్ హీరోగా ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది.


దేవాకట్టా లాంటి గొప్ప దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కాగా ఆ తర్వాత కూడా ఆయన ఇదే రకమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వచ్చాడు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా సామాజిక స్పృహను నెలకొల్పిలా ఉండటంతో మరొకసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు దేవా. సాయి ధరమ్ తేజ్ కు కూడా ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడిందని చెప్పవచ్చు. ఆ విధంగా తొలి సినిమా నుంచి సమాజం ఉద్ధరించే విధంగా సినిమాలు చేస్తూ ముందుకు పోయాడు దేవకట్టా.

ఇక ప్రస్థానం సినిమా చేస్తున్న సమయంలో హీరో శర్వానంద్ కు పెద్దగా ఇమేజ్ లేదు. మంచి సినిమాలు చేస్తున్నాడు అన్న పేరు అయితే ఉంది కానీ శర్వానంద్ కు స్టార్డమ్ అయితే రాలేదు. అది ఈ సినిమాతో వచ్చింది. ఆయనను హీరోగా నిలబెట్టిన సినిమా ఇది.  మొదట్లో ఈ సినిమా అంతగా హిట్ కాలేదనే చెప్పాలి. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు మిక్స్డ్  టాక్ వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడం మొదలు పెట్టి సినిమా కలెక్షన్స్ కు ఊపు అందుకునేలా చేసింది. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలని మరిన్ని రావాలని కోరుకుంటూ టాలీవుడ్ పరిశ్రమ నుంచి సమాజాన్ని మేలుకొలిపే సినిమాలు ఎన్నో రావాలని వాటిలో స్పెషల్ సినిమాగా ఇది నిలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: