ప్రతి సినిమాకి పాటలు అంటే ప్రాణం పోస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. సినిమా స్టోరీ బాడీ లాంటిది అయితే ఇక ఆ సినిమాలోని పాటలు ఊపిరి లాంటివి. ఊపిరి లేకుండా ఎలా అయితే ప్రాణం ఉండదో.. పాటలు లేని సినిమాకు కూడా ప్రాణం లేనట్లే అని చెప్పాలి.  అందుకే సినిమాలోని పాటలకు సినిమా విజయానికి ఎంతోదగ్గరి సంబంధం కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో సినిమా స్టోరీ పైన ఎంతజాగ్రత్త పడుతున్నారో ఇక సినిమా పాటల విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమా అంటే టైటిల్ సాంగ్ మాత్రం పవర్ ఫుల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై ఏ రేంజిలో అంచనాలు పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. బాలయ్య అఖండ సినిమా ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అన్న విషయం టైటిల్ సాంగ్ లో  స్పష్టంగా అర్థమయింది అని చెప్పాలి. బాలయ్య అభిమానులందరినీ కూడా అఖండ టైటిల్ సాంగ్ ఉర్రూతలూగిస్తోంది. అయితే ఇక ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. గత కొంత కాలం నుంచి తమన్ అందిస్తున్న సంగీతం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది అన్న విషయం తెలిసిందే.


 ఎంతో అద్భుతమైన సంగీతం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు తమన్.  ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలే అఖండ టైటిల్ సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బాలకృష్ణ నటిస్తున్న అఖండ టైటిల్ సాంగ్ కంపోజింగ్ విషయంలో చాలా రీసెర్చ్ చేసినట్లు ఇటీవల చెప్పుకొచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అఘోరాలు వారి జీవన శైలి గురించి తెలుసుకుని దాదాపు నెల సమయం తీసుకుని టైటిల్ సాంగ్ కంపోజ్ చేశానని తెలిపాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య నటనతో సినిమాను నెక్ట్స్ లెవల్కు తీసుకెల్లాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: