తెలుగు సినిమా పరిశ్రమలో సామాజిక స్పృహను కలిగించే సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో ఇటీవలే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కొంతమంది అమాయకులపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇదే సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రముఖ దర్శకుడు సతీష్ వెగ్నేశ నిర్మించిన ఈ చిత్రం అల్లరి నరేష్ 57వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ఆయనకు ఘన విజయాన్ని అందజేసింది.

దీనికి ముందు అల్లరి నరేష్ కెరియర్ పెద్దగా సాగడం లేదనే చెప్పాలి. కామెడీ హీరోగా గుర్తింపు పొందిన అల్లరినరేష్  ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవడంతో హీరోగా ఆయన కెరీర్ దాదాపు అయిపోయిందనే అందరూ అనుకున్నారు. దానికి తోడు మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కీలకపాత్ర పోషించడంతో ఇకపై ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నే కొనసాగుతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా నాంది సినిమా వచ్చి అల్లరి నరేష్ ను మరోసారి హీరోగా నిలబెట్టింది.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రియదర్శి ప్రవీణ్ తదితరులు నటించగా తీర్పు కోసం ఎదురుచూస్తున్న న్యాయం కోసం పడిగాపులు కాస్తున్న ఓ అండర్ ట్రైల్  ఖైదీ జీవితం నేపథ్యంలో తెరకెక్కింది. బయట నిజంగా ఈ విధంగా జరుగుతుందా అనిపించేలా ఈ సినిమా ఎంతగానో ప్రతి ఒక్కరిని కనువిప్పు కలిగేలా చేసింది. అంతేకాదు అందరూ అప్రమత్తంగా ఉండేలా కూడా చేసింది. హాస్య పాత్రలకు పేరుగాంచిన నరేష్ ఖైదీగా తనదైన నటనతో ప్రేక్షకులను మరొకసారి అబ్బురపరిచాడు. చాలామందిని ఈ సినిమా మేల్కొలిపింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లాయర్ పాత్ర హైలెట్ గా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: