నిజం చెప్పాలి అంటే మెగాస్టార్ చిరంజీవికి రీ ఎంట్రీ తరువాత సరైన హిట్ అందుకోలేదు అనే చెప్పాలి. ఖైదీ నెం 150 హిట్ అయినా కూడా అది మెగాస్టార్ రేంజ్ కు రీచ్ అవ్వలేదు. ఇక ఆ తరువాత వచ్చిన సైరా నరసింహా రెడ్డి గురించి మనకు తెలిసిందే. అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవి ఆశ లన్నీ కూడా కొర‌టాల శివ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న ఆచార్య సినిమా పైనే ఉన్నాయి. అప్పుడేప్పుడో మూడు సంవ‌త్స‌రాల ముందు అనౌన్స్ చేసిన ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండడం అందరికి ఆశ్చరయాని కలిగిస్తుంది. మధ్యలో కరోనా, లాక్ డౌన్ లు వచ్చినా కూడా ఆచార్య కంటే వెనుక స్టార్ట్ చేసిన సినిమాలు షూటింగ్ కంప్లీట్ అయ్యి..రిలీజ్ కూడా అయిపోయాయి. కానీ ఆచార్య మాత్రం ముందుకు కదలడం లేదు.

ఇక రిసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "ఆచార్య" సినిమా లేట్ అవ్వడానికి కారణం హీరోయిన్. యస్.. ఈ సినిమాలో హీరోయిన్ గా  ఎవరిని  పెడతాం అని ఆలోచించడానికి సుమారు  9 నెలలు ఆలోచించారు కొరటాల. ఆ త‌ర్వాత వెతికి వెతికి ఫైనల్ గా కాజల్‌ను సెట్ చేసారు. దీంతో అక్కడే చాలా టైం వేస్ట్ అయిపోయింది.  ఈ సినిమాలో చిరంజీవి కొడుకు రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ పాత్ర‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను నిరంజ‌న్ రెడ్డి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తుండడం గమనార్హం. ఇప్పటికే  ఈ సినిమా నుండి విడుదలైన టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న క్రమంలో.. నేడు ఆచార్య సినిమాకు సంబంధించిన ఓ అద్దిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నామని చిత్రయూనిట్ ప్రకటించారు.

ఇక దీంతో ఆచార్య సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేసారు "ఆచార్య టీం". ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు బిగ్ షాకిచ్చింది ఆచార్య. అనుకున్న సమయానికి అప్డేట్ రావ్వడం లేదు అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దాంతో అభిమానులు  తీవ్ర నిరాశ పడ్డారు. ఈ మేరకు కొణిదల ప్రొడక్షన్స్ ఈ  ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. "కొద్దిపాటి ఆలస్యం అవుతుంది.. కానీ ఖచ్చితంగా అప్డేట్ మాత్రం అందిరిపోతుంది" అంటూ రాసుకొచ్చారు. ఇక మెగా ఫ్యాన్స్ చిరు- చరణ్ కలిసి ఒకే స్క్రీన్ పై నటిస్తే చూడాలని ఎప్పటినుంచో ఆశగా దురుచూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కల ఈ సినిమాతో నిజం కాబోతుందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: