కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూణేలో పూర్తి చేశారు చిత్రబృందం. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక ఆ వెంటనే గ్యాప్ లేకుండా హైదరాబాద్లో రెండవ షెడ్యూల్లో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మొదటి షెడ్యూల్లో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కియారా అద్వానీ పాల్గొనలేదు. కానీ సెకండ్ షెడ్యూల్ లో ఆమె పాల్గొన్నట్లు గా వార్తలు వినిపించాయి.

 అయితే ఇటీవల ఆమె హైదరాబాద్ రావడంతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇక సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్, కైరా అద్వాని ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఇక ఈ సాంగ్ కోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అద్భుతమైన స్టెప్పులను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి చిత్రయూనిట్ నుంచి ఒకరు సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తయిందని ఆ పోస్ట్ లో తెలిపారు. మళ్లీ డిసెంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ ఉంటుందా..

 లేక రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా విడుదల అయ్యేంతవరకు ఆ ప్రమోషన్ లో బిజీగా ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక దర్శకుడు శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అంతే కాదు కేవలం ఆరు నెలల లోపే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయడానికి శంకర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. అయితే గతంలో శంకర్ తన సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. కానీ రామ్ చరణ్ సినిమాకు మాత్రం వీలైనంత తక్కువ సమయంలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో శంకర్ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: