కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో సహజ నటిగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జయసుధ. ఒకప్పుడు ఎంతో మంది సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా నటించి అలరించిన జయసుధ.. ఆమె అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరూ కట్టిపడేశారు అనే చెప్పాలి. సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జయసుధ. కొన్ని దశాబ్దాల పాటు తెలుగుచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన జయసుధ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.


 హీరోలకు తల్లిగా అమ్మగా నాన్నమ్మ గా ఇలా చెప్పుకుంటూ పోతే జయసుధ ఆమె కెరీర్లో చేయని పాత్ర లేదు అని చెప్పాలి. పద్నాలుగేళ్ళ వయసులో సినీరంగ ప్రవేశం చేసి ఇక ఇప్పటికీ దశాబ్దాలు గడిచిపోతున్న తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళ భాషల్లో కూడా సూపర్హిట్ చిత్రాల్లో నటించారు జయసుధ. ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలతో కలిసి హీరోయిన్ గా నటించిన జయసుధ ఇక నేటి యువ హీరోలకు తల్లిగా ఆ నాన్నమ్మగా నటిస్తూ ఉండటం గమనార్హం.. ఏ పాత్రలో నటించిన కూడా జయసుధ తన సహజ నటనతో ఎంతో మందిని మంత్ర ముగ్దులను చేస్తూ ఉంటుంది


 ఇక వరుసగా సినిమాలు చేసే జయసుధ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఎక్కడా తెరమీద కనిపించడం లేదు. సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు జయసుధ   అయితే ఇటీవల జయసుధ తన న్యూ లుక్ కు సంబంధించిన ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ఫోటోలో సహజ నటిగా తన అందం అభినయంతో ఎంతోమంది ఆకర్షించిన జయసుధ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కాస్త లావుగా ఉండే జయసుధ పూర్తిగా సన్నగా మారిపోయింది. ఇక ఇటీవలే ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జయసుధ స్మైల్ తెరఫీ టైం అంటూ ఒక ట్వీట్ పెట్టింది. ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు జయసుధ కి ఏమైంది ఎందుకు ఇలా మారిపోయారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: