టాలీవుడ్ అప్ కమింగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్ అయితే ఈ హీరోకు గత కొన్నాళ్లుగా హిట్లు లేక ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు శర్వానంద్ అయితే శ్రీకారం అనే సినిమాతో తో చాలా రోజుల తర్వాత తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ నటుడు.ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడం తో ఏదో అలా అలా ఉన్నాడు. అయితే హీరో త్వరలోనే 'ఒకే ఒక జీవితం' అనే సినిమాతో కొంతకాలం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శ్రీ కార్తిక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా...

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ బాబు ఎస్ఆర్ ప్రభు  ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఫ్యామిలీ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమా కు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఓ టి టి లో విడుదల చేస్తారంటూ అప్పట్లో ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ సినిమాను ఓ టి డి లో ఈ కాకుండా థియేటర్ల లోనే విడుదల చేస్తామంటూ ప్రకటించారు. అయితే శర్వానంద్ నటిస్తున్న ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని మొదట అనుకున్నారు..

 కానీ జనవరి లో పెద్ద పెద్ద సినిమాలు రావడంతో ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించనుంది. వీరిద్దరితో పాటుగా వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. అయితే వీరితో పాటుగా అక్కినేని నాగార్జున భార్య అక్కినేని అమల ఒక ప్రధాన పాత్ర లో నటించడం విశేషం.జేక్స్ బీజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా అనంతరం అం మరికొన్ని ప్రాజెక్టులలో కూడా శర్వానంద్ నటిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: