కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ తమ బంధాన్ని ప్రజలకు తెలియకుండా ఇంతకాలం దాచారు. వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నప్పటికీ.. ఇప్పుడు కూడా ఈ విషయంపై ఇద్దరూ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే వీరిద్దరి పెళ్లికి సన్నాహాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. త్వరలో రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్లి ఇద్దరూ రాజరిక పద్ధతిలో వివాహం చేసుకోనున్నారు. అయితే అంతకంటే ముందు మరో పని చేయాలనీ విక్కీ, కత్రినా మరో పని చేయాలనీ డిసైడ్ అయ్యారట. వచ్చే వారం ఈ లవ్ బర్డ్స్ కోర్టు పెళ్లి చేసుకోనున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ తరువాత ఈ జంట త్వరలో తమ పెళ్లి కోసం రాజస్థాన్ చేరుకోనున్నారు.

ముందుగా కోర్టు వివాహం
కత్రినా , విక్కీ కౌశల్ రాజస్థాన్‌లో జరిగే రాజరిక వివాహానికి ముందు వచ్చే వారం ముంబైలో కోర్టు వివాహం చేసుకోనున్నారు. కోర్టు వివాహం పూర్తి అయిన వెంటనే, వాళ్ళు పూర్తి ఆచార వ్యవహారాలతో జైపూర్‌లో రెండు పద్ధతుల్లో వివాహం చేసుకోనున్నారట. డిసెంబర్‌ మొదటి వారంలో ఇద్దరూ రెండు ఆచారాలతో రాజ వివాహం చేసుకోనున్నారు. పెళ్లిని పూర్తిగా గోప్యంగా ఉంచారు. పెళ్లి కారణంగా కత్రినా సినిమాల నుంచి కాస్త విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. విక్కీ బిజీ వర్క్ షెడ్యూల్ కారణంగా అతని సోదరుడు, తల్లి పెళ్లికి సంబంధించిన అన్ని సన్నాహాలు చూస్తున్నారు.

పెళ్లికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. పెళ్లి సందర్బంగా ఇద్దరూ సబ్యసాచి బట్టల్లో కనిపించబోతున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సీజన్స్ ఫోర్ట్‌లో విక్కీ, కత్రినా వివాహం జరగనుంది. పెళ్లికి హాజరయ్యే అతిథులు ఫోన్లు తీసుకురావద్దని, వారి వివాహం ప్రైవేట్‌గా ఉండాలని కోరుకుంటున్నారట. దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో ఇద్దరి రోకా వేడుక జరిగింది. ఇక అతిథులు కోసం కూడా భారీ ఏర్పాట్లు చేయబోతున్నారు ఈ జంట. పెళ్ళికి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు విక్కీ, కత్రినా.  

మరింత సమాచారం తెలుసుకోండి: