'యాక్షన్ ఉమెన్'గా తనదైన ముద్ర వేసిన హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తన జీవితంలోని జరిగిన అత్యంత భయంకరమైన ఉదంతాన్ని తాజాగా అభిమానులతో పంచుకుంది. అసలేం జరిగిందో తెలిస్తే మీరు కూడా భయపడతారు. ఒక ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆమె ఒకప్పుడు ఎలా భయపడిందో, మరణ దేవతను ఎంత దగ్గర నుంచి చూసిందో వివరించింది ఈ బ్యూటీ.
 
2017లో లూయిస్‌విల్లేలోని తన ఇంటి నుంచి న్యూయార్క్‌కు ప్రైవేట్ విమానంలో వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ఆమె చెప్పింది. ప్రయాణం చేస్తుండగా ఆమెకు విమానం లోపల పెద్ద శబ్దం వినిపించింది. విమానంలో ఉన్న సిబ్బంది ద్వారా విమానం మొదటి ఇంజన్ ఫెయిల్ అయినట్లు తెలిసింది. దీంతో జెన్నిఫర్‌కు చాలా భయం వేసింది. విమానంలో ఉన్నవారంతా చనిపోతున్నారని భావించిందట. సీటుపై తన అస్థిపంజరం మాత్రమే మిగిలిపోయినట్లు ఆ సమయంలో ఒక భావన వచ్చిందట.
 
జెన్నిఫర్ తన కుటుంబాన్ని ఆమె మనసులో తన కుటుంబాన్ని గుర్తు చేసుకోవడం ప్రారంభించింది. విమానంలో జెన్నిఫర్‌తో పాటు ఆమె ఇద్దరు సోదరులు, ఓ డాక్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు విమానం నయాగరా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి ఉంటుందని విమాన సిబ్బంది వెల్లడించారట. దీని తర్వాత విమానం పూర్తిగా సైలెంట్ అయిపోయిందని, ఎలాంటి శబ్దం రాలేదని జెన్నిఫర్ చెప్పింది. దీని తర్వాత రెండో ఇంజన్ కూడా ఫెయిల్ అయింది. అది చాలా దారుణమైన ఘటన.

చెత్త విషయం ఏమిటంటే ఆ సమయంలో నా కుక్క (పిప్పి) నా ఒడిలో ఉంది. అది ఈ పరిస్థితిలో ఉండకూడదు. ఇదంతా జరుగుతుండగా విమానం ల్యాండ్ అయింది. రన్‌వేపై అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉండటం కంపించడంతో ఒకేసారి జెన్నిఫర్ మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. అంతా సరిగ్గాఉండాలని ఆమె దేవుడిని ప్రార్థించడం ప్రారంభించింది. ఆ తర్వాత అంతా సవ్యంగా జరగడంతో అందరూ సురక్షితంగా విమానం నుంచి బయటకు వచ్చేశారు. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యాక్షన్ వుమన్ తన జీవితంలో ఇదొక పీడకల అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: